Saturday, 21 November 2026

వార్తలు

వచ్చే ఏడాదిలో ప్రభాస్‌ పెళ్లి: కృష్ణంరాజు

విజయవాడ ,(జనంసాక్షి): సినీ యువహీరో ప్రభాస్‌ వివాహం వచ్చే ఏడాది ఉంటుందని ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు చెప్పారు. ఆయన బుధవారం ఇక్కడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టులో ప్రభాస్‌ హీరోగా నిర్మించే సినిమాకు…

బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారులు దాడులు చేశారు. అన్‌లైన్‌లో నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్న సంస్థలకు చెందిన గోదాంలపై వారు దాడులు చేశారు.

డీఎల్‌ బర్తరఫ్‌ బాధాకరం : మర్రి శశిధర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాకు అనుమతించాలని కోరినా డీఎల్‌ను బర్తరఫ్‌ చేయటం సరికాదన్నారు. డీఎల్‌ బర్తరఫ్‌…

తెరాస ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ మధుయాష్కీ

ఢల్లీి : చలో అసెంబ్లీ నిర్వహించాలన్న ఐకాస పిలుపు తప్పటడుగు అని ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని… ఒక రాజకీయ పార్టీ అని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు…

నేను బొబ్బిలి పులినే దాసరి నారాయణరావు

హైదరాబాద్‌ : ఒక పథకం ప్రకారం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని దాసరి నారాయణరావు అరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ సందర్భంగా తాను బొబ్బిలి పులినేనంటూ వ్యాఖ్యానించారు.

ధర్మాన, సబితా కస్టడీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి జ్యూడిషియల్‌ కస్టడీపై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు…

ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవటంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులపై పోలీసులు మూడు రౌండ్లు…

సీబీఐ మెమోపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడిన అంశాలను లిఖితపూర్వకంగా సీబీఐ అధికారులు కోర్టుకు…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ : రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడన ద్రోణి…

ఈయూ, టీఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కార్మికశాఖ చర్చలు చేపట్టింది బస్‌భవన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ ప్రతినిధులతో కార్మికశాఖ అదనపు కమిషనర్‌ చర్చలు చేపట్టారు.