Friday, 20 November 2026

వార్తలు

ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు

హైదరాబాద్‌ : ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్‌ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఘనంగా శ్రీపసన్న వరద రాజస్వామి చక్రస్నానం

చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తిలో భూదేవి, శ్రీదేవి సమేతుడైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చక్రస్నాన కార్యక్రమం వేడుకగా జరిగింది. వైష్ణవ కోనేటిలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా చక్రస్నానం…

తూర్పు ఢల్లీిలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

న్యూఢల్లీి : తూర్పు ఢల్లీిలోని గురు టెగ్‌ బహదూర్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌ కండిషన్‌ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి…

ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు

హైదరాబాద్‌ : అర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్‌ టాపవ్‌ యూజర్‌, ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏజెంట్లు తస్కరించి భారీగా టికెట్లు విక్రయించారు. అన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లును…

జగన్‌ నిర్భంధాన్ని నిరసిస్తూ గుండు గీయించుకున్న వైఎస్‌ అభిమానులు

నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్‌ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్‌ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్‌ అరెస్టుకు నిరసనగా వడ్లోజు వెంకటచారి ఆధ్వర్యంలో చేపట్టిన  నిరసన కార్యక్రమాలు 365…

సహకార చక్కెర కర్మాగార పాలకవర్గ ఎన్నికల్లో ఘర్షణ

విశాఖ : ఎలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగార పాలక వర్గ ఎన్నికల పోలింగ్‌ రసాభాసగా సాగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా, కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగా కొట్టుకున్నారు. రాష్ట్రంలో ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగార…

తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం

రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల తిరుపతి : నగర రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. తిరుపతిలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ దక్షిణ ద్వారం…

స్పాట్‌ ఫిక్సింగ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి

ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్‌జైట్లీని ఆయన ఈ ఉదయం కలిశారు. అనంతరం మీడియాతో…

ఇటుక బట్టీల్లో తనిఖీలు

గుమ్మడిదల : జిన్నారం మండలం జంగంపేట్‌, అన్నారం, వాయిలాల, దోమడుగు, బొంతపల్లి తదితర గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ బాలకార్మికులు ఉన్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు.

హౌసింగ్‌ సొసైటీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుపై స్టే

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల స్టే విధించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఐడీని కోర్టు అదేశించింది.