Friday, 20 November 2026

వార్తలు

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎన్‌ సేవలను

విస్తరిస్తాం -మంత్రి కోట్ల రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌, పెద్దషాపూర్‌ రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు మహానాడులోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో సంతకం చేశారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 23 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం…

అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తాం: ఇంద్రసేనారెడ్డి

మిర్యాలగూడ : రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా భాజపా పూర్తి మద్దతు నిస్తుందని భాజపా జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల…

మహానాడుకు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే మహానాడుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. ఉదయం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎర్రచందనం పట్టివేత

చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.…

నెహ్రూకు ఘన నివాళి

న్యూఢిల్లీ : భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో పలువురు నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తదితరులు నెహ్రూ సమాధి వద్ద అంజలి ఘటించారు.