Friday, 20 November 2026

వార్తలు

వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రయాణికుడు నందిపేట నుంచి నిజామాబాద్‌ వస్తుండగా మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజుగా గుర్తించారు.

మద్యం వ్యాపారులను ఎన్నికలకు దూరంగా ఉంచాలి

మద్యబహిష్కరణ వేదిక హైదరాబాద్‌ : మద్యం వ్యాపారులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్వచ్ఛంద మద్యబహిష్కరణ వేదిక డిమాండ్‌ చేసింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ మద్య నియంత్రణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని హైదరాబాద్‌ ప్రెన్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన…

సెంట్రల్‌ వర్సిటీలో ‘డిజైన్‌’ భవనానికి శంకుస్ధాపన చేసిన మంత్రి ఆనంద్‌శర్మ

హైదరాబాద్‌,జనంసాక్షి: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ భవనానికి కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ పాల్గొన్నారు.

తెదేపా గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెదేపా దేశ రాజకీయాల్లోనూ ఉనికి చాటుకుందని అన్నారు. 2009లోనే నగదు బదిలీ గురించి తెదేపా…

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఘాట్‌ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మంత్రులను అడ్డుకున్న ఐకేపీ యానిమేటర్లు

వరంగల్‌ : కేశసముద్రంలో ఆర్‌వోబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. తమ  సమస్యలు పరిష్కరించాలంటూఐకేపీ యానిమేటర్లు మంత్రులను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు యానిమేటర్లకు మధ్య తోపులాట జరిగింది. వారి…

వడదెబ్బ మృతులపై ముఖ్యమంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌ : వడదెబ్బ మృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెరాస నేత హరీష్‌రావు లేఖ రాశారు. ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ పరీక్షతో…

సురక్ష కంపెనీ వర్దన్‌ అరెస్టు

విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన వర్దన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్దన్‌ 4క్రితం పరారయ్యాడు.

సీఎంకు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు లేఖ రాసారు. ఎండ తీవ్రతను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. సింగరేణి కార్మికులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పరీక్షలను వాయిదా వేయటంతో పాటు విద్యుత్‌…