Friday, 20 November 2026

వార్తలు

పేపర్‌బోయ్‌ నుంచి ఐఐఎం విద్యార్థిగా…

శివకుమార్‌ కల సాకారం బెంగళూరు : 23 ఏళ్ల శివకుమార్‌ నిన్నటివరకూ పొద్దున్నే వార్తాపత్రికలు పంచేవాడు. ఈరోజు తానే వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ఇంజినీరింగ్‌ చదివిన శివకుమార్‌ కోల్‌కతా ఐఐఎంలో సీటు సంపాదించాడు మరి. గత పదేళ్లుగా శివకుమార్‌…

కేన్స్‌లో దొంగల చేతివాటం

పారిస్‌ : కేస్స్‌లో మరోసారి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. 80 మంది సెక్యూరిటీ గార్డుల కన్నుగప్పి రూ. 2.6 మిలియస్‌ డాలర్ల విలువ చేసే నెక్లెస్‌ను మాయం చేసేశారు. ఫ్రెంచ్‌ రివేరా  హోటల్‌లో జరిగిందీ సంఘటన. డె గ్రిసొగొనొ…

లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్‌ ఏఈ

గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా రొంపిచర్ల విద్యుత్‌ ఏఈ నాంచారయ్య రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. డీఎస్సీ నరసింహారావు నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి.

వేసవి విడిది నుంచి బయలుదేరిన గురునాథ్‌

ఢిల్లీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొనవలసిన చెన్నై సూపర్‌ కింగ్‌ సీఈవో గురునాథ్‌ ఇప్పటివరకు మామ శ్రీనివాస్‌తో కలిసి కొడైకెనాల్‌ వేసవి విడిదిలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన ముంబయి బయల్దేరినట్లు సమాచారం. శ్రీనివాసస్‌ కొడైకెనాల్‌లోనే…

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు కాని సినీ నటి అంజలి

చెన్నై, జనంసాక్షి: దర్శకుడు కళంజియం పరువు కేసులో నటి అంజలి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెకు మరో అవకాశం ఇచ్చింది. జూన్‌ 5 న విచారణ హాజరుకావాలని అంజలిని సైదాపేట కోర్టు ఆదేశించింది. విచారణకు హాజరుకాకుంటే అరెస్టు…

వంపీడీవో, తహసీల్దార్‌ నిర్బంధం

విజయనగరం జిల్లా : తాగునీరు, విద్యుత్‌ సమస్యలు పట్టించుకోవడంలేదంటూ జిల్లాలోని టి.కె. జమ్మ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ సహా సిబ్బందిని గ్రామంలో నిర్బంధించారు. తమ సమస్యలు తీర్చాలని వారు అధికారులను డిమాండ్‌ చేశారు.

శుక్రవారం మధ్యాహ్నానికే 26కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య మధ్యాహాననికే 26కు చేరింది. ఈరోజు రామగుండంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో అరుగురు, అదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, వరంగల్‌ జిల్లాలో నలుగురు, నల్గొండ…

అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధం

ఖమ్మం జిల్లా : కూసుమంచి మండలం భగవత్‌ వీరతండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఆస్తినష్టం అంచనా వేస్తున్నారు.

ప్రశ్నపత్రంతో పరారైన ఇంటర్‌ విద్యార్థి

కర్నూల్‌, జనంసాక్షి: ఇంటర్‌ విద్యార్థి ఆడ్వాన్స్‌డ్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి ప్రశ్నాపత్రంతో పరారీ అయ్యాడు. ఈ ఘటన కర్నూల్‌లోని నారాయణ కళాశాలలో జరిగింది

ఇంటర్‌ బోర్డు ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆందోళన

హైదరాబాద్‌,జనంసాక్షి: నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు నియత్రించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు,…