Thursday, 19 November 2026

వార్తలు

స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో రంజీ మాజీ క్రికెటర్‌ అరెస్టు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజీ మాజీ అటగాడు బాబురావు యాదవ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బుకీ సునీల్‌ భాటియాను చండిలాకు యాదవ్‌ పరిచయం చేశాడంటూ పోలీసులు తెలిపారు.

చర్లలో యువతి అనుమానాస్పద మృతి

ఖమ్మం, జనంసాక్షి: చర్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి శవాన్ని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా సమాధి చేశారు. యువతి అనుమానస్పద స్థితికి సంబదించి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ ఎంపీల ఆలోచన: వీహెచ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఆలోచన అని ఆయన చెప్పారు.…

ఫణీర్‌ మూర్తిని విధుల నుంచి తొలగించిన ఐగేట్‌

న్యూఢిల్లీ,జనంసాక్షి: తమ కంపేనీ అధ్యక్ష, సీఈవో బాధ్యతల నుంచి ఫణీర్‌ మూర్తిని తొలగిస్తున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్ధ ఐగేట్‌ మంగళవారం న్యూఢిల్లీలో ఓ ప్రకటనలో వెల్లడించింది. తోటి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఆరోపణలు…

సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటాం

-చైనా ప్రధాని న్యూఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చించు కుంటామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. వాణిజ్య అసమానతలు రూపుమాపేలా ఇరు దేశాల చర్చల ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చల్లో…

ఉపాధి పనులకు వెళ్లి ఒకరి మృతి

పత్తికొండ, కర్నూలు : ఉపాధిపనుల కోసం వూరి చెరువులో మట్టి తోలేందుకు వెళ్లి హుస్సేస్‌ బీ (60) అనే మహిళ మృతి చెందగా హసీనా, అనీఫా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చెరువులో మట్టి పని చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి…

రాజవొమ్మంగిలో విషాదం

రాజవొమ్మంగి : తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో విషాదం చోటుచేసుకుంది. మూర్ఛ వ్యాధితో ఈ ఉదయం ఓ యువకుడు మృతి చెందాడు. యువకుడి మరణ వార్త విని తట్టుకోలేక అతని తండ్రి, నాయనమ్మ గుండెపోటుతో చనిపోయారు. ముగురి మరణంతో ఆ…

కర్నూలులో దళితులపై వివక్షత చూపించిన అగ్రకులాలు

కర్నూలు, జనంసాక్షి: కృష్ణగిరి మండలం చిట్యాలలో అగ్రకులాలు దళితులపై వివక్ష చూపిస్తున్నాయి. ఆ గ్రామంలోని దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దీంతో దళితులు తీవ్ర ఆవేదన గురై గ్రామ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పేపథ్యంలో అక్కడ అగ్రకులాలకు, దళితులకు…

రూ. 2కోట్ల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

విశాఖ జిల్లా : రోలుగుంట మండలం బీబీ పద్మం వద్ద 570 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని తెలిపారు. అరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మరో ఎనిమిది…

అద్వానీతో భేటీ కానున్న గుజరాత్‌ సీఎం మోడీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీతో గుజరాత్‌ సీఎం, ఆ పార్టీ సీనియర్‌ నేత నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. సమావేశంలో ప్రజాస్వామ్యం పట్ల కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరి ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.