Thursday, 19 November 2026

వార్తలు

కళంకిత మంత్రులను తొలగించాల్సిందే

భాజపా ఒంగోలు సాంస్కృతికం: అరుగురు కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోయి కోటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మాట్లాడుతూ…

గాంధీభవన్‌లో రాజీవ్‌ వర్ధంతి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. రాజీవ్‌ చిత్రపటానికి పీసీసీ అధినేత బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనంసాక్షి: మంగళవారం ఉదయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చింస్తున్నట్లు సమచారం. సమావేశానికి పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు.

ఆర్టీసీ బస్సు ఢీ:తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌ జల్లా : ధన్వాడ మండలం అప్పంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు , ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

యూపీఏ ద్వారానే తెలంగాణ :గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జనంసాక్షి: యూపీఏ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యయని ఎంపీ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్‌తో తమ ఎంపీలు భేటీ విషయం తనకు తెలింయదని పేర్కొన్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలన్న పిటిషన్‌పై సుప్రీం విచారణ

న్యూఢిల్లీ : తదుపరి ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ అరోపణల నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇతర మ్యాచ్‌లు నిలిపివేయాలని సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలైంది.

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

నల్గొండ జిల్లా : భువనగిరి-రాయగిరి రైల్వే మార్గంలో సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ కారణంగా పలు రైళ్లు అలస్యంగా నడుస్తున్నాయి.

బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించిన నారాయణ

కడప : బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రహ్మణిని రద్దు చేసి సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పది రోజులుగా సీపీఐ వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈరోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి…

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి అర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా కాంగ్రెస్‌…

మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

అమీర్‌పేట్‌, హైదరాబాద్‌ : సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోని విజేత మెటల్‌ వర్క్స్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్‌ షెడ్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి షెడ్డు కుప్పకూలింది. సనత్‌నగర్‌ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.…