Thursday, 19 November 2026

వార్తలు

పాకిస్థాన్‌ ఎన్నికల్లో హింస

కరాచీ, జనంసాక్షి: పాకిస్థాన్‌ ఎన్నికల్లో హంస చెలరేగింది. కరాచీలోని ఆవామీ నేషనల్‌ పార్టీ కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానాక ఆసుపత్రికి తరలించారు.

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న సీఎం

శ్రీశైలం : ర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి అలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు సీఎం సాక్షిగణపతి అలయాన్ని దర్శించుకున్నారు.

మిజోరంలో విరిగిపడిన కొండచరియలు

మిజోరం, జనంసాక్షి: మిజోరంలోని ఐజ్వాల్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మంది గల్లంతయ్యారు. సైనికులు, పోలీసులు, స్వచ్చంద సేవా సంస్ధలు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రజలకు కడియం ఏం సమాధానం చెప్తారు? : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకి తెరాస అధినేత కేసీఆరేనన్న కడియం శ్రీహరి ఇప్పుడు తెదేపాను వీడి తెరాసలో ఎలా చేరతారని తెదేపా నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకూ పార్టీ వీడనని చెప్పిన కడియం ఇప్పుడు ప్రజలకు ఏం…

146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

తుపానుగా మారిన తీవ్రవాయుగుండం

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం 10.30 గంటలకు తుపానుగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పెను తుపానుగా మారే అవకాశం ఉంది. చెన్నైకి 1300 కిలోమీటర్ల నైరుతీ దిశలో…

మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో అటెండర్‌ చంద్రయ్య నుంచి రూ. 1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటెండర్‌ను అదుపులోకి…

ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌

ముంబయి : స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అరంభంలో 20 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ లాభపడింది. 5 పాయింట్లకుపైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుంది.

శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి

కర్నూలు : జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ సాక్షిగణపతి అలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

ఐపీఎల్‌-లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో శనివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడబోతోంది. లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న పుణేకు ఈ మ్యాచ్‌ నామమాత్రం కాగా…. ముంబైకి మాత్రం…