Thursday, 19 November 2026

వార్తలు

భానుడి భగభగకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. అత్యధికంగా రామగుండంలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 44 డిగ్రీలు,…

సీఎంతో భేటీ కానున్న కార్యదర్శి కృష్ణమూర్తి

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.

రాహుల్‌కు డెడ్‌లైన్‌ విధించలేం వివేక

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంలో రాహుల్‌ గాంధీకి డెడ్‌లైన్‌ విధించలేమని ఎంపీ వివేక అన్నారు. త్వరలో తెలంగాణ ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని రాహుల్‌ చెప్పారని తెలిపారు. కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం…

టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓ టిఫిన్‌ సెంటర్‌లో గ్యాస్‌ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బాలానగర్‌లో చోటు చేసుకుందిజ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

2014 లోపే తెలంగాణ ఇవ్వాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: 2014 ఎన్నికల లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర,…

కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు: మంత్రి రఘువీరా

విజయవాడ : గ్రామాల్లో కౌలు రైతుల జాబితా తయారు చేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌలు రైతు, భూయజమాని మధ్య…

మహానాడు నిర్వహణకు 16 కమిటీలు

హైదరాబాద్‌ : ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపాడు. మూడు దశల్లో నిర్వహించే మహానాడులో తీర్మానాలు చేసేందుకు 10 అంశాలు గుర్తించినట్లు చెప్పారు.

సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంను ఆశ్రయించిన బాధితులు

న్యూఢిల్లీ : సూక్ష్మరుణ సంస్థల వేధింపులపై సుప్రీంకోర్టును మెదక్‌ , వరంగల్‌, కృష్ణా జిల్లాల బాధితులు ఆశ్రయించారు. దీంతో కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి , ఎస్‌కేఎస్‌ సూక్ష్మరుణ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షల నగదు చోరీ

అమీర్‌పేట, హైదరాబాద్‌ : బ్యాంక్‌ నుంచి నగదు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగి నుంచి రూ.3.5 లక్షలను దుండగులు అపహరించు కుపోయారు. ఎస్‌ఆర్‌ నగర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి నగదును తీసుకువెళ్తున్న జగదీశ్‌ …