Thursday, 19 November 2026

వార్తలు

హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం

హైదరాబాద్‌, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్‌(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ హెచ్‌ఆర్సీ ఎదుట ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ జైపూర్‌లోని సవాయ్‌ మన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతుంది.

20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలను అసహరించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను…

పామాయిల్‌ పరిశ్రమలో అవకతవకలపై విచారణ

అశ్వారావు పేట: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట పామాయిల్‌ పరిశ్రమలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ రమేశ్‌చంద్ర విచారణ చేపట్టారు. పరిశ్రమలో జరుగుతున్న నిర్మహించారు. ఈ సంవర్భంగా అశ్వారావు పేట మండలాల రైతుసంఘలా నాయకులు పరిశ్రమలో జరుగుతున్న…

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 256 పరీక్ష కేంద్రాలను ఏర్నాటు చేశారు. హల్‌ టీక్కెట్లు…

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవిందర్‌పాల్‌ భార్య

న్యూఢిల్లీ:1993 ఢీల్లీ బాంబు పేలుళ్ల కేసులో దేవిందర్‌పాల్‌సింగ్‌ భూల్లార్‌కు మరణ శిక్ష అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆయన భార్యా నవీనీత్‌కౌర్‌ ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్‌ పై కోర్టు నిర్ణయం తీసుకునే వరకూ భర్తకు శిక్ష అమలు పై…

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి లంచం డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సంబరాలు

హైదారాబాద్‌: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహన్ని పార్లమెంట్‌ లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని…

జేఈఈ(మెయిన్‌) ఫలితాలు విడుదల

హైదారాబాద్‌: జేఈఈ(మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. ర్యాంక్‌ల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై మొదటి వారంలోగా జాతీయ ర్యాంకులను ఖరారు చేస్తారు.