Thursday, 19 November 2026

వార్తలు

కోలార్‌లో ఘర్షణలు

కోలార్‌ : కర్ణాటకలోని కోలార్‌లో పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి వర్గీయులు ఘర్షణకుదిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అధిష్ఠానమే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తుంది

సిద్దరామయ్య బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అధిష్ఠానమే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తధ్యమని ఆయన అన్నారు.

జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ :గండ్ర

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ అని , వాస్తవాలు న్యాయస్థానంలో తేలతాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాలో నాయకత్వంపై నేతలు తిరుగుబాటు చేసే పరిస్థితి నెలకొందన్న ఆయన ఆ పార్టీ…

కారు చెట్టును ఢీ: కలెక్టర్‌ మృతి

చిత్తూరు : రేణిగుంట సమీపంలోని మావండూరు వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కడప జిల్లా ప్రత్యేక కలెక్టర్‌ గోపీనాథ్‌ మృతి చెందారు. తిరుపతి నుంచి కడపకు కారులో వెళ్తుండగా అధికారికి గుండెపోటు రావడంతో ఈ ప్రమాదం…

ఆటో అదుపు తప్పి బోల్తా: ఒకరు మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: పిట్ల మండలం రాంపూర్‌ వద్ద ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందింస్తున్నారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు 19.5 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 19.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

బాపట్ల నియోజకవర్గ వైకాపాలో బయటపడ్డ వర్గ విభేదాలు

గుంటూరు : బాపట్ల నియోజకవర్గ వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో మహిళా నగారా పేరిట రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహణకు ముందు పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడ్డింది. బాపట్ల నియోజకవర్గ…

ఓటర్లను కత్తులతో బెదిరించిన రౌడీషీటర్లు

బెంగళూరు, జనంసాక్షి: కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రౌడీషీటర్లు ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తులతో బెదిరించారు. దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.…

ఏ విషయంపైనైనా చర్చలక ఢిల్లీ పిలవడం సహజమే

పనబాక గుంటూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ నుంచిఅధిష్ఠానం పిలుపుపై కేంద్ర మంత్రి పనబాక లక్షి అచితూచి స్పందించారు. ఇందిరమ్మ కలల పథకంపై మంత్రివర్గ సహచరుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలోనే హస్తినకు రావాల్సిందిగా వర్తమానం అందినట్లు వచ్చిన కథనాలను…

నవ్వులతో మార్మోగిన మున్సిపల్‌ స్టేడియం

విజయవాడ : నవ్వండి… నవ్వించండి… ఆరోగ్యాన్ని పంచండి.. అంటూ లాఫ్టర్‌ క్లబ్‌ సభ్యుల సందడితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నవ్వులతో ప్రతిధ్వనించింది. నవ్వితే నూరేళ్లూ … అన్న నినాదంతో వయసు భేదాలు మరిచి సభ్యులంతా నవ్వుల పువ్వులు…