Thursday, 19 November 2026

వార్తలు

కోలార్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

బెంగళూరు : కర్ణాటకలోని కోలార్‌ నియోజకవర్గంలోని 122వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేకుంది. రౌడీషీటర్లు పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తున్న ఓటర్లను కత్తులతో బెదిరించారు. దీంతో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి

విజయవాడ : కృష్ణా , పశ్చిమగోదావరి జిల్లాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరి…

ఉదయం 10.30 గంటల వరకు 15 శాతం పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చేపట్టినట్లు చెప్పారు.

ఎన్నికలను బహిష్కరించిన ముషారఫ్‌ పార్టీ

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఈనెల 11న జరగునున్న సాధారణ ఎన్నికలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అధ్వర్యంలోని అల్‌ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ బహిష్కరించాలని నిర్ణయించింది. ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన 170 మంది…

ఈ సారి కాంగ్రెస్‌దే విజయం

-కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ బెంగళూరు : ఐదేళ్లుగా భాజపా అవినీతితో కర్ణాటక ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. బెంగళూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఈ ఉదయం ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.…

మలేషియాలో సాఫీగా సాగుతున్న పోలింగ్‌

కౌలాలంపూర్‌ : మలేషియా దేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పుతాయని భావిస్తున్న ఎన్నికలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. దాదాపు 56 ఏళ్లుగా అక్కడ అధికారంలో ఉన్న కీలక పార్టీల సంకీర్ణమైన మలేషియా నేషనల్‌ ఫ్రంట్‌ ఈ సారి తీవ్ర…

దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : ‘నీట్‌ (నేషన్‌ల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెస్స్‌) పరీక్ష దేశవ్యాప్తంగా కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, నెల్లూరు, విజయవాడ, విశాఖ, వరంగల్‌ నగరాల్లో పరీక్ష జరుగుతోంది. ఒక్క…

ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఉదయం ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖుల్లో భాజపా సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు,…

ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. సమావేశంలో రైల్వే మంత్రి బన్సల్‌ అవినీతి వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. ఆయన మేనల్లుడు విజయ్‌సింగ్లా ఓ రైల్వే ఉన్నతాధికారి నుంచి రూ.90 లక్షల లంచం…

పీవీ సింధును అభినందించిన సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: మలేషియా ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను గెలుచుకున్న భారత రైజింగ్‌ స్టార్‌ పీవీ సింధును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. సింధు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.…