Thursday, 19 November 2026

వార్తలు

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ యనమల చేత మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం ,చేయించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. కాగా ఈ…

ఆర్కే బీచ్‌లో గల్లంతైన ఇద్దరు బాలురు

విశాఖ : ఆర్కే బీచ్‌లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. వెంటనే అధికారులు, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

రహస్యంగా వివాహం చేసుకున్న ఇంకొల్లు ఎస్‌ఐ

తిరుమల, జనంసాక్షి: ప్రకాశం జిల్లా ఇంకొల్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ శనివారం తిరుమలలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఐదు సంవత్సరాలుగా తనతో  ప్రేమగా ఉంటూ పెండ్లి చేసుకుంటానని నమ్మించి కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడ్డాడంటూ విజయ్‌కుమార్‌పై భట్టిప్రోలు…

లారీ బోల్తా పడి ఇద్దరు మృతి

తాళ్లూరు : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురం వద్ద ఈ ఉదయం ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. 17 మందికి గాయాలయ్యాయి. మృతులను యర్రగొండపాలెం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను…

యూపీఏ అసమర్థత వల్లే పొరుగు దేశాల దుశ్చర్యలు

-భాజపా నేత వెంకయ్యనాయుడు నల్గొండ : యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పొరుగు దేశాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం వెళ్తూ నల్గొండ జిల్లా సూర్యాపేటలో వెంకయ్య మీడియాతో మాట్టాడారు. చైనా…

ఈ ఉదయం ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస సముదాయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను…

మేనల్లుడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు : బన్సల్‌

న్యూఢిల్లీ : లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన తన మేనల్లుడు వి.సింగ్లాతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని రైల్వే శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ వెల్లడించారు. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు.…

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని మంత్రి పార్థపారథి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను ఏబీవీపీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కీర్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి

నాచారం, హైదరాబాద్‌ : నిర్మాణంలో ఉన్న నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రి భవనం 8వ అంతస్తు నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతున్ని బీహార్‌కు చెందిన పురానా (18) అనే యువకుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి…

6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం  నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.