Thursday, 19 November 2026

వార్తలు

ప్రధానితో న్యాయశాఖ మంత్రి భేటీ

ఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు అగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించొద్దు : హైకోర్టు

హైదరాబాద్‌ : గ్రూప్‌-1 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించవద్దంటూ హైకోర్టు ఏపీపీఎస్పీని ఆదేశించింది. మెయిన్స్‌లో తప్పులు దొర్లాయంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు పైవిధంగా స్పందించింది.

వ్యవసాయ సంపదపై పన్నులేదు

చిదంబరం ఢిల్లీ : వ్యవసాయ రంగంపై సంపద పన్ను లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. జూలై 1,2010 నుంచి అక్టోబర్‌ 1,2012 వరకు రైల్వేకు సేవాపన్ను మినహాయింపు ఉన్నట్లు చిదంబరం పేర్కొన్నారు.

లారీ, బైక్‌ ఢీకొని ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : మెదక్‌లోని జహీరాబాద్‌ మండలం హుగ్గెల్లి వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందినట్లు సమాచారం.

ప్రధానితో భేటీ అయిన అహ్మద్‌పటేల్‌

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌ భేటీ అయ్యారు. బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ అంశంపై చర్చించారు.

బొగ్గు కుంభకోణంపై విచారణ మే 8కి వాయిదా

న్యూఃఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై విచారణను సుప్రీంకోర్టు మే 8కి వాయిదా వేసింది. ఏ నిబంధనల మేరకు దర్యాప్తు నివేదిక వివరాలు చెప్పారో తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను కోర్టు అదేశించింది. ప్రభుత్వానికి నివేదిక విషయాలు తెలిపిన అంశంపై మే…

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీం

న్యూఢిల్లీ : నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

బీఎస్‌ఆర్‌, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ

బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ…

రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న బోగీలో మంటలు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం అందించే మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌ (అరోగ్య సహాయక వ్యాన్‌) మంటల్లో ఆహుతైంది. మంటలధాటికి గ్యాస్‌ సిలిండర్లు…