Thursday, 19 November 2026

వార్తలు

జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతున్న సత్యాగ్రహ దీక్ష

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఐకాస చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండో రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొనసాగుతోంది. పలువురు నేతలు దీక్షాస్థలికి వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. భాజపా నేత విద్యాసాగర్‌రావు, స్మృతిఇరాని తదితరులు దీక్షాస్థలికి…

మెదక్‌ జిల్లా బంద్‌ మే 3కి వాయిదా

హైదరాబాద్‌ : బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస మే 2న చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌ను 3వ తేదీకి వాయిదా వేసింది. మే 2న పాలిటెక్నిక్‌ ప్రవేశ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

దర్యాప్తు పూర్తయిన తర్వాతనే తుది ఛార్జిషీట్‌

సుప్రీంకోర్టులో సీబీఐ వాదనలు న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో సీబీఐ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని సీబీఐ తరపు న్యాయవాది అశోక్‌భాను కోర్టుకు…

లోక్‌సభ నుంచి భాజపా వాకౌట్‌

న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ లోక్‌సభ నుంచి భాజపా సభ్యులు వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఆ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ పలు కుంభకోణాలతో యూపీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని మండిపడ్డారు.

ఇంకెంతకాలం సంప్రదింపులు కొనసాగిస్తారు: పొన్నం

న్యూఢిల్లీ : తెలంగాణపై ఇంకెంత కాలం సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తారని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌ అవరణంలో చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్వహించిన…

అధికారంలో కొనసాగే నైతిక హక్కు యూపీఏ కోల్పోంయింది

-భాజపా నేత సుష్మాస్వరాజ్‌ న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వంలో కొత్త కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. 2జీ…

2 గంటలకు వాయిదా వేసిన రాజ్యసభ

న్యూఢిల్లీ : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు కుభంకోణంతోపాటు వివిధ అంశాలపై సభ్యులు నిరసనకు దిగారు. సభ్యులు శాంతించకపోవడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు…

ప్రధాని రాజీనామాకు లోక్‌సభలో విపక్షాల పట్టు

న్యూఢిల్లీ : బొగ్గుకుంభకోణంపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్రధాని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళన మధ్యే ద్రవ్య వినిమయ…

సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువు జూన్‌ 4 వరకు పెంపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ , విశాఖలో డిజిటల్‌ ప్రసారాల కోసం సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువును జూన్‌ 4 వరకు పెంచుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై తీర్పును కోర్టు జూన్‌ 4కి వాయిదా…

బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం

-కేంద్ర ఉక్కు శాఖ మంత్రి న్యూఢిల్లీ : పార్లమెంట్‌ ఆవరణంలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణిప్రసాద్‌వర్మ కలిశారు. బయ్యారంలో ఉక్కు దిమ్మెల పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఎంపీలకు హామీ ఇచ్చారు.