Thursday, 19 November 2026

వార్తలు

ప్రియురాలి కుటుంబసభ్యుల దాడిలో ప్రియుడు మృతి

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలం గుండారంలో ప్రియుడిపై ప్రియురాలి కుటుంబసభ్యులు దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన యువకుడు కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 2009 పాయింట్లపైగా లాభపడింది. నిఫ్టీ 48 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెంగళూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. ఆయన నేడు, రేపు బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాననున్నారు.

గుప్తనిధుల కోసం నరబలి యత్నం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని కబ్జి గ్రామంలో గుప్త నిధుల కోసం దుండగులు నరబలి యత్నించారు. అయితే గ్రామస్థులు దీన్ని అడ్డుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని…

100 లీటర్ల నాటు సారాను పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్‌ చెరువు సమీపంలో ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 100 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. 2 వేల లీటర్ల బెల్లంవూటను ధ్వంసం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

తండ్రిని చంపిన కొడుకు

అనంతపురం: కుటుంబకలహాల నేపధ్యంలో తండ్రిని కొడుకు దారుణంగా చంపిన ఘటన తాడిపత్రి మండలంలో చోటుచేసుకుంది. రెడ్డివారిపాలెంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అతని కొడుకు నిన్న రాత్రి గొంతుకోసి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల సీఎం ప్రచారం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగే కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి మృతి

నాగ్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో అత్యాచారానికి గురైన ఐదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందింది. నాగ్‌పూర్‌లోని ఐసీయూలో ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడి చిన్నారి నిన్న సాయంత్రం చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఘన్‌సోర్‌ పట్టణానికి చెందిన బాలికను ఏప్రిల్‌ 17న…

శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు

తిరుమల: మంత్రులు శైలజానాధ్‌, పార్థసారధి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో అలయానికి చేరుకున్న మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అలయ అర్చకులు వేదాశీర్వచనాలు పలికి…

లీగల్‌ నోటీసులు అందలేదు : మంత్రి ఆనం

నెల్లూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన లీగల్‌ నోటీసులు తనకు ఇంకా అందలేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. లీగల్‌ నోటీసులు అందిన తర్వాత సమాధానం చెప్తామన్నారు. జగన్‌ను ఉరి తీయాలని ఆనం వ్యాఖ్యానించిన…