Thursday, 19 November 2026

వార్తలు

ఇంటర్‌ విద్యార్థి మనస్థాపంతో మూడు రోజులుగా ఆచుకిలేకపోయింది

ఎల్లారెడ్డిపేట: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో తప్పానని మనస్థాపంతో ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. కరీంనగర్‌ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేటకు చెందిన మంగళహారతుల రాకేశ్‌ మూడు రోజులుగా కనిపించడం లేదు. ఇంటర్‌ ఫలితాలు చూసుకోవడానికి బయటకు వెళ్లిన…

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్ట పోయింది. నిప్టీ 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

రెండో ఆటోలు ఢీకొన్ని చిన్నారి మృతి

ఖమ్మం: చర్ల మండలం ఆర్‌. కొత్త గూడెంలో ఈ ఉదయం రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాంగ్రెస్‌ కార్యకర్తపై బాంబులతో దాడి

కడప : పెద్దముడియం మండలం సుద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిపై ప్రత్యేర్థులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.

నేడు లోకాయుక్త విచారణ చేపట్టనున్నంది

హైదరాబాద్‌: మంత్రి ధర్నాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై నేడు లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ లోకాయుక్త ముందు హాజరు కానున్నారు.

బాంబు పేలుడుకు సంబంధించిన ముగ్గురు అరెస్టు

బెంగళూరు : నగరంలోని భాజపా కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుకు సంభందించి ముగ్గురు అనుమానితులను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. వీరిలో పీర్‌ మోహిద్దీన్‌, బషీర్‌ అనే నిందితులను నిన్ను రాత్రి అరెస్టు చేయగా ఈ ఉదయం…

నేటి నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్ల జారీ

నయీంనగర్‌(వరంగల్‌), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న తేదీన జరిగే ఐసెట్‌ 2013 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈనెల 23 మధ్యాహ్నం 2గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.…

7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గుండక్లమ్మ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

కామారెడ్డి ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థిని కీర్తనను గుర్త తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అత్యాచారాలు, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీపై ఢిల్లీలో జరగిన దాడిపై సభను విపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. అంతకు ముందు కూడా ప్రతిపక్షాల ఆందోళనల మధ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ…