Tuesday, 17 November 2026

వార్తలు

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించే సాహసం సీఎంకు లేదని ఎద్దేవా చేశారు.…

జైబున్నీసాకు మరో 4వారాల గడువు

న్యూఢీల్లీ, జనంసాక్షి: 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన జైలున్నీసాతో సహా నలుగురికి లొంగిపోయేందుకు సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువిచ్చింది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఇచ్చిన గడువును కూడా ధర్మాసనం నాలుగు…

తెలుగు మాధ్యమం అభ్యర్థులకు ఊరట

ఢీల్లీ, జనంసాక్షి: మోడల్‌ స్కూళ్ల ఉపాధ్యాయ పోస్టుల్లో తమకు కూడా అవకాశం కల్పించాలన్న తెలుగు మాధ్యమం అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలుగు మీడియం అభ్యుర్థుల ఫలితాలను ప్రకటించాలని కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు మీడియం…

‘తెలంగాణ వాదులను రెచ్చగొట్టడమే వారి పని’

హైదరాబాద్‌, జనంసాక్షి: విజయవాడ కాంగ్రెస్‌ లగడపాటి రాజ్‌ గోపాల్‌, మంత్రి టీజీ వెంకటేష్‌, పరకాల ప్రభాకర్‌ పై ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొట్టడం వారికి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా…

అనుమానాస్పద స్థితిలో ఖైదీ మృతి

వరంగల్‌, జనంసాక్షి: వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో శివమణి అనే ఖేదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దాంతో మృతుని కుటుంబ సభ్యులు గురువారం జైలు ఎదుట ఆందోళనకు దిగారు. హన్మకొండ మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సొమాని గుండుంబా…

ఇంకా దొరకని శ్రియ ఆచూకీ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి ఉంటున్న నాగరాజు -రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటున్న శ్రియను గుర్తు…

కొనసాగుతున్న పసిడి పతనం

ముంబయి.జనంసాక్షి: గత వారం రోజులుగా పడుతూ వస్తున్న బంగారం ధర ఈ వాళకూడా నష్టాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర ఉదయం 20 డాలర్ల దాకా కోల్పోతూ 1357 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది.రాత్రి బంగారం ధర…

ఢీల్లీలో సీఎం రహస్య మంతనాలు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఢీల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనూహ్యంగా రెండు గంటల పాటు మాయం అయ్యారు. సెక్యూరిటీ లేకుండా ఓ ప్రైవేట్‌ వాహనంలో ఆయన బయటకు వెళ్లారు.. ఏపీ భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి సెక్యూరిటి సిబ్బందికి కనీస…

ఏపీ భవన్‌లో సిఎంని కలిసిన దుగ్గల్‌

న్యూఢీల్లీ, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హో శాఖ మాజీ కార్యదర్శి వి. కె. దుగ్గల్‌ గురువారం ఏపీ భవన్‌లో కలిశారు. వీరిద్దరి మధ్యపలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే వి. కె. దుగ్గల్‌ గతంలో ప్రత్యేక తెలంగాణ…

ముషారఫ్‌ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమయ్యింది. బెయిల్‌ పొడిగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను సింధ్‌ కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో ముషారఫ్‌ ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతుండగానే ముషారఫ్‌ కోర్టు…