Tuesday, 17 November 2026

వార్తలు

సెబీ ఎదుట హజరైన సుబ్రతారాయ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: డిపాజిట్లు సేకరించిన కేసులో సెబీ ఎదుట సహారా గ్రూపు సంస్థల చైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇవాళ హాజరయ్యారు. సుబ్రతారాయ్‌తో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌ అధికారులు సెబీ ఎదుట హాజరయ్యారు.

ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలు విడుదల

విజయవాడ, జనంసాక్షి: చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలను విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం http://ntruhs.ap.nic.in/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఢిల్లీలో రక్షణ కరువైందన్న బెంగాల్‌ సీఎం మమత

ఢిల్లీ, జనంసాక్షి:  ఢిల్లీలో రక్షణ కరువైందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన మమత ఇవాళ చిదంబరంతో భేటీ రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయల్దేరారు. మమత తోపాటు…

శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క లేకపోవడంపై పీఏసీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డిపాజిట్‌…

మలేషియా ఎన్నికలు మే 5న

కౌలాలంపూర్‌, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

యూపీలో బాలిక నిర్భందంపై సుప్రీం ఆగ్రహం

లక్నో, ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల బాలికను పోలీసులు నిర్భందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను పోలీసులు నిర్భదించడాన్ని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సోమవారంలోగా…

శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  నాలుగురోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్విని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులు పాపను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన రావుల కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అనురాగ్‌శర్మ…

వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

వరంగల్‌, జనంసాక్షి:  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది, ఎక్సైజ్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. 9 లక్షల విలువైన 25 ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లోకాయుక్తాలో హీరో నాగార్జునపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: హీరో నాగార్జునపై మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జాచేసి ఎన్‌కన్వెన్షన్‌ కట్టారని జనంకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్తా జీహెచ్‌ఎంసీ, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, తహశీల్ధార్‌తో సహా…

ఏసీబీ వలలో చిక్కిన మాక్లూర్‌ ఎస్సై

నిజామాబాద్‌,  జనంసాక్షి: మాక్లూర్‌ ఎస్సై శేఖర్‌ ఓ కేసుకు సంబధించిన ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.