Tuesday, 17 November 2026

వార్తలు

న్యాయస్థానాల్లో మౌలిక వసతులు లేవు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ న్యూఢీల్లీ : దేశంలో చాలా న్యాయస్థానాల్లో సరైన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త…

విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్టాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను యాజమాన్యం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో అసిస్టేట్‌ మేనేజర్‌ సత్యనారాయణ, టెక్నీషియన్లు సాభాన్‌, ఎస్‌. శ్రీనివాస్‌, కళాసి అనిల్‌…

పాడి పశువులపై పులి దాడి

– ఆరు పశువుల మృతి – భయాందోళనలో ప్రజలు విశాఖ : సబ్బవరం మండలం పెద్దయాటపాలెంలో పశువులపై పులి దాడికి దిగింది. ఈ ఘటనలో ఆరు పశువులు మృతి చెందాయి. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం

విశాఖ : కశింకోట మండలం బయ్యవరం వద్ద హెరిటెజ్‌ డెయిరీలో ప్రమాదం చోటుచేసుకుంది. డెయిరీలో బాయిలర్‌ పేలుడుతో ముగ్గురు ఒప్పంద కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని డెయిరీ సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించారు.

అగ్ని-2 క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌ : సాధారణ రేంజ్‌ క్షిపణి అగ్ని-2ను ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి ఈ ఉదయం ప్రయోగించారు. ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరం : ప్రధాని

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత రాజ్యాంగ పరిరక్షణకు పటిష్ఠమైన చట్టాలు అవసరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు.…

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జేఈఈ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరాల్లో మెయిన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. వరంగల్‌, తిరుపతి, గుంటూరు, ఖమ్మం నగరాల్లో మొత్తం 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా…

భార్యను గొంతుకోసి చంపిన భర్త

చిత్తూరు : కుటుంబ కలహాలతో ఓ భర్త భర్య గొంతుకోసి చంపేసి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరం గ్రామంలో ఈ దారుణం జరిగింది. కుమార్‌ అనే వ్యక్తి తొలుత తన భార్య గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత…

విద్యార్థులను ఆందోళకు గురిచేసిన ఇన్విజిలేటర్లు

తిరుపతి : జేఈఈ పరీక్ష ప్రారంభించే చివరిక్షణంలో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు విద్యార్థులను ఆందోళనకు గురిచేశారు. హాల్‌ టిక్కెట్స్‌ జిరాక్స్‌ కాపీ కావాలన్నారు. జిరాక్స్‌ కాపీ కోసం విద్యార్థులు పరుగులు తీశారు. ఇన్విజిలేటర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

ముగిసిన టెన్త్‌ ప్రధాన పరిక్షలు

జనంసాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి ప్రధాన పరీక్షలు శనివారంతో ముగిశాయి. మరో రెండు పరీక్షలను ఈ నె 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. 8న ఒ.ఎస్‌.ఎస్‌.సి. మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌), 9న ఎస్‌.ఎస్‌.సి. వొకేషనల్‌…