Monday, 16 November 2026

వార్తలు

ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ అధ్యక్షుడు బొత్స

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం ఏపీ భవన్‌లో కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో కిరణ్‌, బొత్స సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ తుది జాబితాను…

అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక లారీల పట్టివేత

అమరావతి : గుంటూరు జిల్లా అమరవాతి మండలంలోని పొందుగల, మల్లాడి గ్రామాల ఇసుక రేవులపై ఈ తెల్లవారుజామున పోలీసుల దాడులు నిర్వాహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌ చేశారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ…

అధికారుల తనిఖీలో 30 లారీల సీజ్‌

హైదరాబాద్‌ : విజయవాడ, కరీంనగర్‌, వరంగల్‌, రహదారుపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. అధిక లోడ్‌తో వెళ్తున్న 30 లారీలను సీజ్‌ చేశారు. వాహనాల యజమానులకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ పర్యటనను బహిష్కరించిన అజ్మీర్‌ దర్గా గురువు

అజ్మీర్‌ : పాకిస్థాన్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అఫ్రాఫ్‌ నేడు భారత పర్యటనకు రానున్నారు. రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్యీర్‌ దర్గా దర్శించుకోనున్నారు. మరోవైపు పాక్‌ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తునట్లు అజ్మీర్‌ దర్గా ఆధాత్మిక గురువు జైనుల్‌ అబేదిన్‌ తెలిపారు.…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకే మద్దతిస్తామని నాగం జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలవరం టెండర్లు వెంటనే రద్దు చేసి సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తిరుపతి – కరీంనగర్‌ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి – కరీంనగర్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 13న తిరుపతి – కరీంనగర్‌, 14న కరీంనగర్‌ – తిరుపతిల మధ్య…

ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌, బొత్సల భేటీ

ఢిల్లీ : ఎమ్మెల్సీ అభ్యర్థుల  ఎంపికపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.

చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ మాజీ ఛైర్మన్‌ జంపన ప్రతాప్‌ చంచల్‌గూడ కారాగారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. ములాఖత్‌ ద్వారా కారాగారంలోకి వెళ్లిన ప్రతాప్‌ దాదాపు గంటకు పైగా జగన్‌తో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణపై జగన్‌తో చర్చించినట్లు…

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇరువురి మృతి

హైదరాబాద్‌ : ఆల్వాల్‌  మచ్చ బొల్లారంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందన చేతన్‌, శేషురామ్‌గా గుర్తించారు.