Monday, 16 November 2026

వార్తలు

డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంతకల్లు – సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌…

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు దేశ రాజధానిలో నేడు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై వారు చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.

‘సహకారం’పై నేడు పరిశీలకులతో బొత్స భేటీ

హైదరాబాద్‌: సహకార ఎన్నికలకు పార్టీ పరంగా నియమితులైన పార్టీ పరిశీలకులతో గురువారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాణ భేటీ కానున్నారు. ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలకులు బొత్స దృష్టికి తీసుకురానున్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం…

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నేడు జరుగుతున్న ఆరు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 14 జిల్లాలోని ఆరు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 83 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1437 పోలింగ్‌ కేంద్రాల్లో  6.32 లక్షల మంది…

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

సుండుపల్లి: తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును బుధవారం అర్థరాత్రి కడప జిల్లా సుండుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచల పర్వతాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన పలువురు స్మగ్లర్లు మండలంలో రాయవరం  ప్రాంతం నుంచి స్మగ్లింగ్‌…

నేటి నుంచి పార్లమెంటు బడ్డెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ : నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్టీ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ సజావుగా సాగాలంటే…

కడప డీసీసీబీ ఎన్నిక వాయిదా

కడప : నేడు జరగవలసిన డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. తిరిగి ఈ నెల 28న ఎన్నిక నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

నేడూ కొనసాగనున్న సార్వత్రిక సమ్మె

హైదరాబాద్‌: కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె నేడు కూడా కొనసాగనుంది. అన్ని ప్రధాన  కార్మిక, ఉద్యోగ సమాఖ్యలు చేపట్టిన సమ్మె కారణంగా  బుధవారం జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన…

నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆరు నియోజకవర్గాలు.. 83 మంది అభ్యర్థులు హైదరాబాద్‌: పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. మూడు ఉపాధ్యాయ (శ్రీకాకుళం- విజయనగరం – విశాఖపట్నం, వరంగల్‌ –…

ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. జైపూర్‌లో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు అపోహలకు దారితీశాయని…