Monday, 16 November 2026

వార్తలు

వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా

వరంగల్‌ :వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక ఫలితాన్ని వాయిదా వేశారు. దీంతో రాఘవరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదగొట్టారు. ఛైర్మన్‌ పదవి కోసం నిర్ణీత సమయానికి…

‘సడక్‌ బంద్‌’ ఆగదు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్‌ బంద్‌ ఆగదని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 24న సడక్‌ బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై సీఎంతో నేతల చర్చ

హైదరాబాద్‌: వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర ఖేటీ అయ్యారు. వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికపై సీఎంతో చర్చించారు. దొంతి…

శాసనసభా కమిటీ హాల్లో సమావేశమైన ప్రభుత్వ సంస్థల కమిటీ

హైదరాబాద్‌: జెన్‌కో, మెట్రోరైలు, గృహ నిర్మాణశాఖలపై సమీక్షించేందుకు మంగళవారం శాసనసభ కమిటీ హాలులో ప్రభుత్వ సంస్థల కమిటీ సమావేశమైంది. జెన్‌కో నుంచి రైల్వేశాఖకు అదనంగా చెల్లించిన రూ. 9కోట్ల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మెట్రో…

నడుచుకుంటూ అయినా హైదరాబాద్‌ చేరుకుంటాం : ఏపీఎన్‌జీవో

విశాఖపట్నం : ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చి 2న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 10వ వేతన సంఘాన్ని నియమించాలని కోరుతూ తాము…

గ్రూప్‌ -1 ప్రక్రియను నిలిపివేయండి : హైకోర్టు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌ -1 నియామకాలను మళ్లీ గ్రహణం పట్టింది. 2011వ సంవత్సరంలో ప్రకటించిన గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌కు సంబంధించి కమిషన్‌ నిర్వహించిన ప్రిలిమినరీ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం కీలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు హైకోర్టును…

విద్యార్థి తల పగలగొట్టిన ఉపాధ్యాయురాలు

వరంగల్‌: ఓ విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి నవ్వాడని ఉపాధ్యాయురాలు అతని తల పగలగోట్టిన సంఘటన వరంగల్‌లో చుటచేసుకుంది. హన్మకొండ మండలం అరెపల్లి ఎన్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తోటగిరి తేజ తరగతి గదిలో తోటి విద్యార్థులతో…

నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నిన్న పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు.…

మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నికల వాయిదా

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్‌ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.

హెలికాప్టర్‌ కొనుగోలు ఒప్పందం రద్దుపై భిన్నాభిప్రాయాలు లేవు : ఆంటోనీ

న్యూఢిల్లీ : హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. హెలికాప్టర్‌ కొనుగొలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు.…