Monday, 16 November 2026

వార్తలు

ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో నేడు ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను పరీశీలించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8.40 నిమిషాలకు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి  హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌…

కలప గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌లోని కలప గోదాంలో సోమవారం ఆర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో కలప అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు శకటాలతో గంట సేపు శ్రమించి…

వీరప్పన్‌ అనుచరుల ఉరిపై తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరుల ఉరి అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరి అమలుపై బుధవారం వరకు స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.…

వామ్మో ! మంత్రి ఇంట్లో

ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం కోహిమా, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): ఎన్నికలు జరగనున్న నాగాలాండ్‌లో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా నాగాలాండ్‌హోంమంత్రి హిన్‌కాండ్‌ ఎల్‌ ఇచన్‌ వద్ద భారీగా…

హెలికాప్టర్ల ఒప్పందంపై చర్చకు సిద్ధం : ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి ): హెలికాప్టర్ల కుంభకోణంపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తొలిసారిగా స్పందించారు. వీవీఐపీల హెలికాప్టర్ల ఒప్పందంలో ప్రభుత్వం దాచడానికి ఏవిూ లేదని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సోమవారం…

ప్రధాని కావాలని ఉంది మాయ మనుసులో మాట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): సార్వత్రిక ఎన్నికలు ఇంకా కొన్ని నెలల్లో ముంగిటకు రానున్న కాలంలో రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలకు సైతం ఊపిరిపోస్తున్నారు. అందరికళ్లు, అన్ని పార్టీలు ప్రధాని పదవిపై కన్నేసి ఉంచాయి. ఏకపార్టీకి…

పంచాయతీ ఎన్నికలకు సుప్రీం పచ్చజెండ

బీసీలకు 34 శాతం కోటాకు ఓకే 2001 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికల నిర్వహణకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపిం ది. ప్రస్తుత రిజర్వేషన్ల…

ఖమ్మం ట్రాఫిక్‌ ఎస్‌ఐ సస్పెన్షన్‌

ఖమ్మం:ఖమ్మం ట్రాఫిక్‌ ఎస్సై వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు గురయ్యారు. నకిలీ ట్రాఫిక్‌ చలానాల వ్యవహారంలో ఆయన సస్పెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది.

ఇలాభట్‌కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి ప్రదానం

న్యూఢిల్లీ:ప్రముఖ సంఘసేవకురాలు ఇలా రమేశ్‌ భట్‌కు ఈ రోజు 2011 సంవత్సరపు ఇందిరా గాంధీ శాంతి బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణఖ్‌ ముఖర్జీ చేతుల మీదుగా జరిగిన ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రధాని…

సమాజసేవే నాటా ఆశయం : అధ్యక్షుడు సంజీవరెడ్డి

హైదరాబాద్‌: సాంస్కృతిక వికాసం, సమాజసేవను సమన్వయం చేసుకుంటూ పనిచేయడమే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆశయమని అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.…