Monday, 16 November 2026

వార్తలు

లీల అరెస్టు : రేపు వాంగ్మూలం నమోదు

మియాపూర్‌, హైదరాబాద్‌ : ఎస్సై సుధీర్‌ వేధింపులపై లీల అనే మహిళ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎస్సై సస్పెండ్‌ అయ్యారు. ఈలోపు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడిన కారణంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు…

సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన టీఎన్‌జీవోలు

హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చేందుకు టీఎన్‌జీవోలు సచివాలయానికి వచ్చారు. ఆధిక సంఖ్యలో ర్యాలీగా వచ్చిన వీరు సచివాలయం ఆవరణంలో తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.

పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్‌ సమావేశం

ఢిల్లీ : రాష్ట్రాల కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలతో రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షునిగా నియమితులైన రాహుల్‌ గాంధీ వివిధ రాష్ట్రాల పార్టీ నేతలతో రెండు రోజుల పాటు ఈ సమావేశం జరుపనున్నారు. వచ్చే…

ఉల్కాపాతంతో 400 మందికి గాయాలు

మాస్కో : రష్యాలోని యూరల్‌ పర్వత శ్రేణుల సానువుల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఉల్కాపాతంతో 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ఉల్కల చిన్న…

అక్బరుద్దీన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన నిజామాబాద్‌ కోర్టు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు నిజామాబాద్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 10 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో అక్బరుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది.

టేకు తోటలో అగ్నిప్రమాదం

ప్రకాశం : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో టేకుతోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 ఎకరాల టేకు తోట దగ్ధమైంది.

పోలీస్‌ కస్టడీలో వ్యక్తి పరారీ

హైదరాబాద్‌: ఉప్పల్‌ వద్ద పోలీస్‌ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి పరారయ్యాడు. భార్యను వేధించిన కేసులో నిందితుడిని న్యాయస్థానంనుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసుల కన్నుగప్పి అతను పరారైనట్లు సమాచారం తెలిసింది.

ఉత్సవ రథాన్ని తితిదేకు అందించిన గవర్నర్‌

హైదరాబాద్‌: హిమయత్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా ఉత్సవ రధాన్ని అందించారు. వూరేగింపు రధాన్ని గవర్నర్‌ నుంచి తితిదే ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. సుమారు రూ. 10 లక్షల వ్యయంతో ఇత్తడి, రాగి…

గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా సహకార సంఘం ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండావూపింది. డీసీసీబీ ఎన్నికల నిర్వహణపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిన్‌ అఫ్జల్‌ వి పుర్కర్‌తో కూడిన ధర్మాసనం కోట్టివేసింది.

పాక్‌ సైనికుడిని కాల్చిచంపిన భారత సైన్యం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్‌ సైనికుడిన భారత సైన్యం కాల్చి చంపింది. పాక్‌ విజ్ఞప్తి మేరకు మృత దేహాన్ని ఆ దేశానికి అప్పగించడానికి సైన్యం అంగీకరించింది.