Monday, 16 November 2026

వార్తలు

ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి): విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆదివారం జూబ్లీహాలులో తెలుగు న్యాయపాలన…

కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి

అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి వందల సంఖ్యలో క్షతగాత్రులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయ చర్యలు అలహాబాద్‌, (జనంసాక్షి) : మహా కుంభమేళాలో మహా అపశృతి చోటు చేసుకుంది. మౌనీ…

ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి న్యూయార్క్‌లో ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి ప్రసవం కోసం స్థానిక ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే క్రాంతి మృత్యువాతపడ్డాడు.…

‘నగరబాట’లో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్‌రావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నగరబాట’ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. ఇవాళ సీతాఫల్‌మండిలో నిర్వహించిన నగరబాటకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ చేరారు. టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడాలి :…

కొనసాగుతునంన నవోదయ టీచర్ల సమ్మె

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం 11.30 గంటలకు నవోదయ పరీక్ష ప్రారంభం కావలసి ఉంది. నవోదయ పాఠశాల టీచర్లు మాత్రం ఇంకా సమ్మెలో కొనసాగుతున్నారు. దాంతో పరీక్షల నిర్వహణకు అధికారులు  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవు

కేంద్ర మంత్రి మనీష్‌తివారి హైదరాబాద్‌: పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు ఉండవని కేంద్ర మంత్రి మనీష్‌తివారి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన హైదరాబాద్‌లో కోరారు. తెలంగాణ అంశం సున్నితమైందని, సమస్య పరిష్కారమయ్యే వరకు ఓపిక…

కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరి మృతి

మెదక్‌: కొల్చారం లోతువాగు మలుపు వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

16న హైదరాబాద్‌కు అన్నాహజారే

హైదరాబాద్‌: సామాజిక ఉద్యమ కార్యకర్త అన్నాహజారే ఈ నెల 16న హైదరాబాద్‌ రానున్నారు.17న సికింద్రాబాద్‌లోని వెస్లీ కాలేజీలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.

యూపీఏ అసమర్థ విధానాల వల్లే పెరుగుతున్న ద్రవ్యలోటు :వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దేశంలో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయని అన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన…

అటవీ అధికారులపై స్మగ్లర్ల దాడి

కరీంనగర్‌: మహాముత్తారం అటవీప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన కలపను పట్టుకున్న అటవీ అధికారులపై స్మగ్లర్లు దాడికి దిగారు. అనంతరం స్మగ్లర్లు కలపతో అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడ్డ నలుగురు అధికారులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స…