Sunday, 15 November 2026

వార్తలు

ప్రధాని విజ్ఞప్తిని మన్నించాలని కావూరి నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి మేరకు లోక్‌సభలో ఎఫ్‌డీఐలపై ఓటింగులో పాల్గొనాలని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు నిర్ణయించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయనకు నిన్న ప్రధాని ఫోన్‌ చేసి ఓటింగ్‌లో పాల్గొనవలసిందిగా కోరినట్లు  తెలిసింది.

అఖిలపక్షానికి తేదీ ప్రకటించడం చరిత్రాత్మకం :మధుయాష్కి

ఢిల్లీ : అఖిల పక్ష ఏర్పాటుపై తేదీని ప్రకటించడం చరిత్రాత్మకమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణవాదులంతా హర్షించాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాటం…

సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే :మంత్రి గీతారెడ్డి

హైదరాబాద్‌: అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ లక్ష్యంగా ఏకాకిని చేసినా శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించిన ఘనత తమ పార్టీకి దక్కిందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. అంబేద్కర్‌ ఆలోచనావిధానం, ఎస్సీ,…

ఐవోసీని సస్పెండ్‌ చేయడం బాధాకరం : మల్లారెడ్డి

హైదరాబాద్‌: ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ను సస్పెండ్‌ చేయడం బాధాకరమని, ఈ చర్యతో భారత పరువు మంటగలిసిందని రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పుడిప్పుడే భారత క్రీడాకారులు సమస్యలను పరిష్కరించాలన్నారు.…

టీఆర్‌ఎస్‌ పల్లెబాట ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ బుధవారం పల్లెబాట ప్రారంభించింది. ఈ పల్లెబాట తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలో కొనసాగనుంది. పల్లెబాటలో తెలంగాణవాదులు హుషారుగా పాల్గొంటున్నారు. పల్లెబాట ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు విడమరిచి చెప్తామని…

ఫిలిప్పీన్స్‌లో టైపూన్‌: 200 మంది మృతి

మనీలా : శక్తిమంతమైన టైపూన్‌ ప్రభావానికి భారీ వర్షాలు కురిసి వరదలు ముంచుకురావడం, కొండ చరియలు విరిగిపడడం లాంటి సంఘటనలు వరసగా జరగడంతో ఫిలిప్పీస్స్‌లో 200 లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 151 మంది మరణించినట్లు అధికారులు…

ఢిల్లీ గడ్డమీద కూడా ‘టీ’పై వివక్ష: ఆమోస్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఢిల్లీ గడ్డ మీద కూడా తెలంగాణపై వివక్ష కనబడుతున్నదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌ కోసం ప్రధాని ఎంపీ కావూరికి ఫోన్‌ చేయడంపై ఆమోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.…

కోల్‌కతా టెస్ట్‌లో సచిన్‌ అర్ధశతకం

కోల్‌కతా : కోల్‌కతాలో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఇంగ్లాండ్‌ – భారత్‌ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో సచిన్‌ టెండుల్కర్‌ అర్ధ శతకం నమోదు చేశారు. 124 బంతుల్లో 63 పరుగులు చేసిన మాస్టర్‌ బ్యాట్సమస్‌ 11 ఫోర్లు…

ఎంపీలను బుజ్జగించేందుకే అఖిలపక్షం : తెదేపా

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో ఓడిపోతామన్న భయంతోనే ఎంపీలను బుజ్జగించేందుకు అఖిలపక్షం ఏర్పాటుచేసే నిర్ణయం తీసుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తొలుత లేఖ రాసింది చంద్రబాబేనని, తెలంగాణపై పార్లమెంటులో…

జగన్‌కు 19 వరకు రిమాండ్‌ పొడగింపు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో జగన్‌, మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిని పోలీసులు సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితులకు రిమాండ్‌ను కోర్టు ఈ నెల 19 వరకు పొడగించింది. నేటితో రిమాండ్‌ ముగుస్తుండటంతో వీరిని భారీ…