Saturday, 14 November 2026

వార్తలు

ప్రకాశం జిలాల్లో ఉప్పోంగి ప్రవహిస్తున్న వాగులు

ప్రకాశం : నీలం తుపాను ప్రభావంతో జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నల్లవాగుకు వరద పోటెత్తడంతో కోత్తపట్నం మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండకమ్మ ప్రవాహంతో ఒంగోలు – చీరాల ప్రదాన రహదారి జలమయమైంది. మార్కాపురం వద్ద…

పూర్తియిన ఎర్రన్నాయుడు అంత్యక్రియలు

శ్రీకాకుళం: టీడీపీ సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంచనాలతో నిర్వహించారు. భౌతికకాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. అభిమానులు, కార్యకర్తల రోదనలతో నిమ్మాడ శోకసంద్రంలో మునిగిపోయింది.

అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడి అంత్యక్రియలు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెదేపా సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఎర్రన్నాయుడు భౌతిక కాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి…

రైవాడ ఎడమ కాలువకు గండి

విశాఖ: నీలం తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. వరద నీరు పోటెత్తడంతో రైవాడ జలాశయంలో నీటిమట్టం 112 అడుగులకు చేరింది. రైవాడ ఎడమ కాలువకు గండి పడటంతో వేలాది ఎకరాల్లో పొలాలు నీట…

ఫిలిప్పీన్స్‌ ద్వీపంలో భూకంపం

మనీలా: దక్షిణ ఫీలిప్పీన్స్‌ ద్వీపంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా  నమోదైంది. దక్షిణ తందాగ్‌ పట్టణానికి 20 కిలో మీటర దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఎయిర్‌పోర్టులో మాదకద్రవ్యాలు పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ. 3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు ఈ ఉదయం పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మలేషియాకు అక్రమంగా వీటిని తరలిస్తుండగా తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులు వాటిని పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకోన్నట్లు సమాచారం.

నేటి నుంచి ఆరో విడత భూపంపీణీ

పుట్టపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆరో విడత భూపంపిణీ చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని పుట్టపర్తిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 16 వేల మందికి లబ్ధదారులకు భూపంపిణీ కార్యక్రమంలో పట్టాలు ఇవ్వనున్నారు. లక్ష ఎకరాలు పంపిణీ…

టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూర్‌ సమావేశం వాయిదా

హైదరాబాద్‌: 5,6 తేదీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించ తలపెట్టిన పోలీట్‌బ్యూరో సమావేశాలు వాయిదా వేశారు. కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత కారణంగా సమావేశం వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొలీట్‌బ్యూరో, పార్టీ ఎమ్మెల్యేల సమావేశాలు 7,8 తేదీల్లో నిర్వహించాలని…

కోతకు గురైన ఖమ్మం-రాజమండ్రి రోడ్డు

ఖమ్మం: నీలం తుపాను కారణంగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉదృతికి సత్తుపల్లి వద్ద రాజమండ్రి-ఖమ్మం ప్రధాన రహదారి కోతకు గురైంది. దీంతో ఈ రోడ్డుపై వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి…

నేడు ఢిల్లీకి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి!

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాంలీలా మైదానంలో ఎఫ్‌డీఐలకు అనుకూలంగా జరిగే ర్యాలీ , సభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌ తిరిగి వస్తారు.