Monday, 9 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌ కేసులోనే భత్కల్‌ అరెస్టు : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ కుట్ర కేసులోనే మోస్ట్‌ వాంటెడ్‌ భత్కల్‌ను అరెస్టు చేసునట్లు ఎన్‌.ఐ.ఏ తెలిపింది. అసదుల్లా అక్తర్‌తో కలిసి భత్కల్‌ హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర చేసాడని ఎన్‌.ఐ.ఏ పేర్కొంది. హైదరాబాద్‌ ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్‌ రిక్కీ చేశాడని ఎన్‌.ఐ.ఏ…

జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్న సచివాలయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జై తెలంగాణ నినాదాలతో సచివాలయం మార్మోగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టాలని తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి జై తెలంగాణ నినాదాలు చేశారు. పోటీగా సీమాంధ్ర ఉద్యోగులు విభజన నిర్ణయాలన్ని…

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో హైదరాబాద్‌ అంతర్భాగమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రాంతం ప్రజలే  ప్రజలా… తెలంగాణ వారు ప్రజలు కారా?…

విధులు బహిష్కరించిన తెలంగాణ లాయర్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగిపై జరిగిన దాడిపై నిజనిర్ధారణకు విద్యుత్‌సౌధకు వెళ్లిన న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ పది జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రమత్నం చేస్తున్నారని లాయర్లు ఆరోపించారు.…

రూపాయి పతనంపై రాష్ట్రపతిని కలవనున్న బీజేపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంశాలపై బీజేపీ బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలవనున్నట్లు ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కారం అంత సులువుగా దొరకదని ఆయన అన్నారు. ప్రస్తుత…

నేడు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌ తెలంగాణ బిల్లు పెట్టాలంటూ ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించనున్నారు. తెలంగాణవాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని  సూర్యం పిలుపునిచ్చారు.

నేడు మంచిర్యాలలో లక్ష గొంతుకల కార్యక్రమం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలంటూ ఈ రోజు మంచిర్యాలలో లక్ష గొంతుకల కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందరెడ్డి జేఏసీ నేతలు పాల్గొననున్నారు.

హైదరాబాద్‌ సహా పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేటలో భారీవర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్గొండ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో భారీవర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి.

వేడుకగా క్రీడా దినోత్సవం

ఖమ్మం,(జనంసాక్షి):  క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఖమ్మం స్గేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్‌ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు ముల్కీ అమరవీరుల వారోత్సవం

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 1నుంచి 7వరకు తెలంగాణ రాజకీయ ఐకాస ముల్కీ అమరవీరుల వారోత్సవ  కార్యక్రమాలు నిర్వహిచనున్నారు. సెప్టెబరు 1న హైదరాబాద్‌, 2న ఆదిలాబాద్‌, 3న నిజామాదబాద్‌, 4న కరీంగర్‌, 5న వరంగల్‌, 6న మహబూబ్‌నగర్‌లో అమరవీరుల వారోత్సవం జరుపనున్నారు.…