Monday, 9 November 2026

తెలంగాణ

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలి :మందా జగన్నాథం

హైదరాబాద్‌,(జనంసాక్షి): వెంటనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాట్టాలని ఎంపీ మందా జగన్నాథం డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ అధినేత చెప్పారని, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు ఉపసంహరించాలని ఆయన అన్నారు.

మాహక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించం: కోదండరామ్‌

హైదరాబాద్‌: తమ హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమని తెలంగాణ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు అడ్డుపడితే వూరుకునేది లేదని, వచ్చే నెల 7న హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపిల్సిన…

జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): చంచల్‌గూడ జైల్లో దీక్ష చేస్తున్న జగన్‌కు ఈ ఉదయం వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జగన్‌కు గ్లూకోజ్‌ లెవల్స్‌ పూర్తిగా పడిపోయాయని వైద్యులు తెలిపారు. దీక్ష విరమించాల్సిందిగా జగన్‌కు  వైద్యులు సూచించారు.

వ్యాన్‌ బోల్తా: ఆరుగురి మృతి

నల్లగొండ,(జనంసాక్షి): దేవరకొండ మండలం కొండమల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి డీసీఎం బోల్లా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి…

ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఇండియన్‌ ముజాహుద్దీన్‌ వ్యవస్థాపకుడు, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది యాసిస్‌ భత్కల్‌ను ఎస్‌.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. ఇండో-నేపాల్‌ సరిహద్దులో భత్కల్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో భత్కల్‌ ప్రధాన నిందితుడు.

సెప్టెంబర్‌ 4 వరకు నగరంలో నిషేదాజ్ఞలు : అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నేటి నుంచి వచ్చే నెల 4 వరకు హైదరాబాద్‌లో నిషేదాజ్ఞలు విధిస్తున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు సీపీ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం బీఆర్‌కే…

నేడు తెలంగాణ పీఆర్‌టీయూ శాంతిదీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో ఒక్కరోజు శాంతి దీక్షను చేపట్టనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, కోదండరామ్‌, దేవీశ్రీప్రసాదరావు, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌ హాజరు కానున్నట్లు తెలిపారు.…

తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు : శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 7 న సమైక్య సభ పెడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. సమైక్య సభ పెడితే…

విస్టమ్‌ చౌదరిని అరెస్టు చేయాలి : దేవీప్రసాద్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఎస్సీ మహిళా ఉద్యోగులపై దాడికి దిగిన విస్టమ్‌ చౌదరిని అరెస్టు చేయాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఎంఎన్‌జే అసుపత్రిలో నర్సులపై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గోకుల్‌చాట్‌ నిందితులపై ఛార్జీషీటు దాఖలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అక్బర్‌ షఫి, సయూద్‌లపై పోలీసులు అభియోగాలు మోపుతూ ఛార్జీషీటు దాఖలు చేశారు. అహ్మదాబాద్‌, ఢిల్లీ పేలుళ్ల ఘటనలతో కూడా సంబంధం ఉన్నట్లు షఫి, సయీద్‌లపై అభియోగాలు…