Monday, 9 November 2026

తెలంగాణ

ఢిల్లీ బయలుదేరిన మంత్రులు

హైదరాబాద్‌:నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌ గౌడ్‌లు ఢిల్లీ బయలుదేరారు. హైదరాబాద్‌పై తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి తెలిపేందుకు వీరు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నారనే వూహాగానాలు వస్తున్న నేపథ్యంలో మంత్రులిద్దరూ ఢిల్లీ పయనమయ్యారు.

సీఎల్పీలో సీమాంధ్ర నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీలో సీమంధ్ర కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశానికి  మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌తో పాటు  ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీమాంధ్ర నేతలు…

సాయంత్రం హస్తినకు వెళ్లనున్న డి. శ్రీనివాస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ పీసీసీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఈ సాయంత్రం హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణపై హైకమాండ్‌ నిర్ణయం  తీసుకుంటున్న నేపథ్యంలో అధిష్ఠానం నుంచి ఆయనకు పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లున్నట్లు సమాచారం. తెలంగాణపై…

సీమాంధ్రలో భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులను భారీగా మోహరించారు. కర్నూలు, కడప, విజయవాడ, విశాఖ పట్టణాల్లో పోలీసులు మార్చ్‌ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పోలీసులు మోహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు పటిష్ఠ బందోబస్తు…

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కోదండరాం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదంరాం భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, తాజా రాజకీయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

మధ్యాహ్నం ఢిల్లీకి సీఎస్‌ మహంతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇవాళ మధ్యాహ్నం హస్తిన వెళ్లనున్నారు. ఇవాళ తెలంగాణపై తుది నిర్ణయం వెలువరిస్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పిన నేపథ్యంలో మహంతి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

హస్తిన బయల్దేరిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం సోనియా నివాసంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీకి సీఎం హాజరవుతున్నట్లు సమాచారం. ఢిల్లీ బయల్దేరే ముందు క్యాంపు కార్యాలయంలో సీఎంతో మంత్రులు…

ఢిల్లీ బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అహ్మదుల్లా, బాలరాజు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు.

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు బాలరాజు , అహ్మదుల్లా భేటీ అయ్యారు. కాసేపట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసిన డీజీపీ

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణా జిల్లా మూలపాడు ఘటనలు పునరావృతం కాకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం…