Sunday, 8 November 2026

తెలంగాణ

ఓయూ పీఎస్‌పై విద్యార్థుల రాళ్ల వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌పై విద్యార్థులు రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. మరోవైపు ఇందిరా పార్క్‌ నుంచి చలో అసెంబ్లీకి తరలి వస్తున్న…

సొమ్మసిల్లి పడిపోయిన తెరాస నేత శ్రవణ్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇందిరాపార్క్‌కు చేరుకున్న తెరాస నేత శ్రవణ్‌ సొమ్మసిల్లి పడిపోయారు. శ్రవణ్‌తో పాటు అక్కడి చేరుకున్న తెరాస కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో తోపులాట జరిగింది. దీంతో రోడ్డుపై శ్రవణ్‌…

తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట

హైదరాబాద్‌ : గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో తెరాస ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ అవరణలో ఆందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన అనంతరం గోల్కోండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గోల్కోండ పీఎస్‌లో తెరాస ఎమ్మెల్యేలు మాక్‌ అసెంబ్లీ…

గాంధీలో వైద్యులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్కు వరకూ ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేసి వైద్యులను అక్కడే నిర్భంధించారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైద్యులు నినాదాలు చేశారు.

ఎంపీ విజయశాంతి అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన మెదక్‌ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా విజయశాంతి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

తెలంగాణ వాదులదే నైతిక విజయం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పోలీసుల్ని మోహరింపచేసి ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ వాదులదే నైతిక విజయమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ప్రొఫేసర్‌ కోదండరామ్‌ అన్నారు. చలో అసెంబ్లీకి బయల్ధేరిన ఆయనను పోలీసులు అశోక్‌ నగర్‌ వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా…

కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్టీవోనేత శ్రీనివాస్‌గౌడ్‌ను అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో…

సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ :అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ నిబంధనలు పాటించాలని రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టులు, నిర్భంధాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.

తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద అందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌, కోత్తకోట దయాకర్‌తో…

ఇందిరాపార్కుకు చేరుకుంటున్న తెలంగాణ వాదులు

హైదరాబాద్‌ : తెలంగాణ వాదులు విడతల వారీగా ఇందిరాపార్కుకు చేరుకుంటున్నారు. అక్కడ మోహరించిన వేలాది మంది పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్కు వైపు బయలుదేరారు.