అసెంబ్లీ భవనంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు
హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్‌లు శాసనసభలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి భవనంపై నుంచి తెలంగాణ నినాదాలు చేశారు.
హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్ భాస్కర్‌లు శాసనసభలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లచొక్కాలు ధరించి భవనంపై నుంచి తెలంగాణ నినాదాలు చేశారు.
హైదరాబాద్ : ఓయూ నుంచి అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లురువ్వారు. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, తెరాస నేతలు వినోద్, జితేందర్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీని ముట్టడించేందుకు నిజాంక్లబ్ వద్దకు చేరుకున్న ఎంపీలు, తెరాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ…
నల్గొండ : చలో అసెంబ్లీ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో 2,500 మంది పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాంటి తెలిపారు. మరో 260 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
హైదరాబాద్ : సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ వేకువజామున శ్రీహరి సుప్రభాతం, అభిషేకం సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వరంగల్ : భాగ్యనగర్ ఎక్స్‌ప్రెన్‌ను పోలీసులు కాజీపేటలో నిలిపివేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ : చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. ఒక్క విద్యార్థిని కూడా క్యాంపస్ నుంచి బయటికి రాకుండా యూనివర్శిటికీ వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్లు వేసి పోలీసులు…
హైదరాబాద్ : భద్రతా ఏర్పాట్లు చూస్తే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…చలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఈ స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం సరిహద్దును తలపిస్తోందని…
హైదరాబాద్ : హింస మన మార్గం కాదు, విధ్వంసాలకు పాల్పడవద్దని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ వాదులకు సూచించారు. నిరసన తెలిపే ప్రజల ప్రాథమిక హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజాస్వామ్య…
మెట్‌పల్లి : చలో అసెంబ్లీకి సంఘీభావంగా మెట్‌పల్లి కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్ తరలి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కోర్టు ఎదుట నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి భానుమూర్తి తదితర…