Sunday, 8 November 2026

తెలంగాణ

అసెంబ్లీ ముట్టడికి టీడీపీ మద్దతు

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీ ముట్టడికి టీడీపీ తెలంగాణ ఫోరం మద్దతు ప్రటించింది. పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటాయని టి. టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జేఏసీ స్వంతంత్రంగా వ్యవహరించాల్సిన…

ఈనెల 17 నుంచి సీఎం సమీక్షా సమావేశాలు

హైదరాబాద్‌ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈనెల 17 నుంచి 22 వరకూ ఈసమీక్షా సమావేశాలు జరగనున్నాయి.

ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం

హైదరాబాద్‌ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతన సవరణలపై ఎటువంటి హామీ ఇవ్వలేదని ఈయూ, టీఎంయూ సంఘ…

విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ ఎదుట నారాయణ బైఠాయింపు

హైదరాబాద్‌ : విద్యుత్‌ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో ఈఆర్‌సీ ఛైర్మన్‌ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఏలు వేయవద్దని మొరపెట్టుకున్నా  ఈఆర్‌సీ పట్టించుకోవడం లేదంటూ పోడియం మందు ఆందోళనకు…

30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు: జేసీ

హైదరాబాద్‌ : శాసనసభలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదని కాంగ్రెస్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చొరవ తీసుకుని సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అవసరమైతే తెరాస ఎమ్మెల్యేలను బయటకు…

సభలో మైక్‌ ఇచ్చి కట్‌ చేయటం అవమానించటమే

ముద్దుకృష్ణమ హైదరాబాద్‌ : సభలో మైకు ఇచ్చి కట్‌ చేయటం ప్రతిపక్షాన్ని అవమానించడమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. మంత్రి అనం అన్ని విషయాలపై మాట్లాడవచ్చు కానీ… మేం ఏం మాట్లాడాలో స్పీకర్‌ చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.

బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారులు దాడులు చేశారు. అన్‌లైన్‌లో నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్న సంస్థలకు చెందిన గోదాంలపై వారు దాడులు చేశారు.

డీఎల్‌ బర్తరఫ్‌ బాధాకరం : మర్రి శశిధర్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రివర్గం నుంచి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌ బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాజీనామాకు అనుమతించాలని కోరినా డీఎల్‌ను బర్తరఫ్‌ చేయటం సరికాదన్నారు. డీఎల్‌ బర్తరఫ్‌…

నేను బొబ్బిలి పులినే దాసరి నారాయణరావు

హైదరాబాద్‌ : ఒక పథకం ప్రకారం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని దాసరి నారాయణరావు అరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ సందర్భంగా తాను బొబ్బిలి పులినేనంటూ వ్యాఖ్యానించారు.

ధర్మాన, సబితా కస్టడీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి జ్యూడిషియల్‌ కస్టడీపై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19 వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్‌రెడ్డి కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు…