Sunday, 8 November 2026

తెలంగాణ

నా బర్తరఫ్‌పై సభలో నిలదీస్తా: డీఎల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): నన్నెందుకు మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేశారో శాసన సభ వేదికగా నిలదీస్తాను. నా శాసన సభ్యత్వాన్ని ఎవరూ ఏమీచేయలేరు కదా ? అని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారరెడ్డి అన్నారు. తనను మంత్రి వర్గం నుంచి…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,080, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26.500గా ఉంది. కిలో వెండి ధర రూ.44,500…

గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేపట్టిన టీడీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజా సమస్యలపై గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొంది. కళంకిత మంత్రులను తొలగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఏడాది బాలుడు

కీసర,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్‌గనర్‌లో వేణు అనే ఏడాది బాలునిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

శాసనసభ వ్యవహారాల సలహాసంఘం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సభాపతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ప్రారంభంమైంది. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల పని దినాలు, ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెదేపా బృందం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏపీపీఎస్సీ అక్రమాలపై తెదేపా పోరును ఉధ్ధృతం చేసింది. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో కాపేపట్లో గవర్నర్‌ నరసింహన్‌ తెదేపా బృందం కలవనుంది.

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శంకర్‌పల్లి హెచ్‌ఎండీఏ కార్యాలయంలో విద్యుత్‌ఘాతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు క్యాబిన్లలో ఫర్నిచర్‌ సహా పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది.

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండో విడత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది.

తెలంగాణ అంతటా రుతుపవనాలు

హైదరాబాద్‌: కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లోను రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతం…