Sunday, 8 November 2026

తెలంగాణ

సోంపేట కాల్పుల ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,( జనంసాక్షి): సోంపేట కాల్పుల ఘటనపై విచారణను రాష్ట్ర హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

భద్రాచలంలో హనుమాన్‌ భక్తులకు నిలువు దోపిడీ

భద్రాచలం, ఖమ్మం : హనుమాన్‌ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా… అలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కల్యాణకట్ట వద్ద భక్తుల నుంచి రూ. 10కి బదులు రూ. 50 వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు…

సీబీఐకోర్టులో హాజరైన జగన్‌ కేసు నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులు విజయసాయిరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో రాజగోపాల్‌, ఎమ్మార్‌ కేసులో విజయరాఘవ కోర్టు…

సీఎం కిరణ్‌ కుమార్‌తో మంత్రి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం క్యాంపు ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

కొడుకును హత్య చేసిన తండ్రి

ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. గ్రామానికి చెందిన జానం రామయ్య కుమారుడు మల్లేష్‌ (35) గత కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులను…

నేడు హైదరాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు నగరంలో నిజాంకాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీలో చేరుతున్నారు.

సీఎంతో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమచారం.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌( జనంసాక్షి:) విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశశించనున్నాయి. ఇవి…

రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్న ఐకాస నేతలు

హైదరాబాద్‌ : నేడు హైదరాబాద్‌కు రానున్న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలంగాణ ఐకాస నేతలు కలవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అయన్ను కలిసి తెలంగాణ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే భాజపా…

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టుకున్న అటవీశాఖ

అధికారులు ఆదిలాబాద్‌ : దిల్వార్‌పూర్‌ మండలం రాంపూర్‌ వద్ద ఐచర్‌ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కలప విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.