Sunday, 8 November 2026

తెలంగాణ

గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు 30 ఆవులు, లేగ దూడలను డీసీఎంలో తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్‌, గోసంరక్షణ  సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు…

పెళ్లి ఇంట్లో చోరీ

హైదరాబాద్‌ : మౌలాలీలోని గోపాల్‌నగర్‌లో ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు, పెళ్లి బట్టలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

ఎంజీఎం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రిలోని మెడికల్‌ రెండో విభాగంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటేనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వరంగల్‌ జిల్లా : హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం ద్విచక్రవాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

దంపతుల ఆత్మహత్య

మెదక్‌ జిల్లా : దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దినేష్‌ (25), అతని భార్య బేబీ (20) గత మూడు నెలలుగా నర్సాపూర్‌లోని శ్రీరాంసాగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.…

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

హైదరాబాద్‌ :నేడు రాష్ట్రవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు రాష్ట్రంలోని హైదరాబాద్‌ , విశాకపట్నం, విజయవాడ, వరంగల్‌ , నెల్లూరు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కామారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య

కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణానికి చెందిన కుంబాల వూశయ్య (50)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కామారెడ్డి పోలీసులు ఈ…

భద్రాచలం క్షేత్రానికి పోటెత్తిన హనుమాన్‌ భక్తులు

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. రేపు హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ…

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ

హైదరాబాద్‌(జనంసాక్షి:)  సీమాంధ్ర దురహంకారంతో ప్రవర్తిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఎల్బీనగర్‌లో కృష్ణ జలాల ఫేజ్‌`3 పనుల శంకుస్థాపన సభలో సీఎం ప్రసంగాన్ని తెలంగాణ వాటర్‌ వర్క్స్‌ కార్మికులు అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావును పిలవకపోవడంపై ఆందోళన…