Sunday, 8 November 2026

తెలంగాణ

ఐకేపీ సిబ్బంది దీక్షలు ప్రారంభం

ఖమ్మం సంక్షేమం : జిల్లా ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద దీక్షలను ప్రారంభించారు. 12వ రోజు దీక్షలను జిల్లా అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను…

కుటుంబాన్ని వెలివేయడంపై హెచ్‌ఆర్సీ ఆగ్రహం

కరీంనగర్‌ : జిల్లాలోని బండలింగంపల్లిలో కుటుంబాన్ని వెలివేసిన ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. కుటుంబాన్ని వెలివేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మానవ హక్కుల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది.

ధిక్కార ఎమ్మెల్యేల అనర్హతపై మరోదఫా విచారణ

హైదరాబాద్‌ : ధిక్కార శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై సభాపతి నాందెడ్ల మనోహర్‌ దఫా విచారణ చేపట్టారు. ఈ విచారణకు టీడీఎల్పీ వివ్‌ నరేంద్రం, తెదేపా ధిక్కార ఎమ్మెల్యే హరీశ్వర్‌ రెడ్డి హాజరయ్యారు.

ప్యాకేజీల కోసమే తెరాసలో చేరుతున్నారు: పొంగులేటి

హైదరాబాద్‌: వ్యక్తిగత అజెండా ప్యాకేజీలతోనే నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ అరోపించారు. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందుకు పెట్టి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ…

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48…

కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని వసనస్థలిపురం సాహెబ్‌నగర్‌ వద్ద ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు.

వేశ్య పాత్రలో అర్చన

హైదరాబాద్‌ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్‌ ఫిలిమ్స్‌ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. శివాజీ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకత్వం…

వేములవాడలో విరిగిన ధ్వజస్తంభం

వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వేములవాడలో వీచిన  భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది…

తెలంగాణపై టీడీపీకీ స్పష్టత ఉంది: ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి):  తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందర్‌ చేసిన ఆరోపణలను ఆ పార్టీ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ధర్మారం : మండలంలోని బొమ్మారెడ్డిపల్లి వద్ద వరంగల్‌ `రాయపట్నం రాష్ట్ర రహదారిపై కొబ్బరికాయల లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గుంజే కొండాలు (27), పెదవేగి మండలం…