నీటీ కోసం రోడ్డెక్కిన మహిళలు
నారాయణఖేడ్, జనంసాక్షి: మండలంలోని మంగళపేటలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో ఖేడ్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించారు.
నారాయణఖేడ్, జనంసాక్షి: మండలంలోని మంగళపేటలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో ఖేడ్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించారు.
మహబూబ్‌నగర్ : కొత్తకోటలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చించారు.
ఖమ్మం, జనంసాక్షి: చర్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి శవాన్ని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా సమాధి చేశారు. యువతి అనుమానస్పద స్థితికి సంబదించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆలోచన అని ఆయన చెప్పారు.…
హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. రాజీవ్ చిత్రపటానికి పీసీసీ అధినేత బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
మహబూబ్‌నగర్ జల్లా : ధన్వాడ మండలం అప్పంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు , ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
నల్లగొండ, జనంసాక్షి: యూపీఏ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యయని ఎంపీ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్‌తో తమ ఎంపీలు భేటీ విషయం తనకు తెలింయదని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా : భువనగిరి-రాయగిరి రైల్వే మార్గంలో సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ కారణంగా పలు రైళ్లు అలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా కాంగ్రెస్…
అమీర్‌పేట్, హైదరాబాద్ : సనత్‌నగర్ పారిశ్రామిక వాడలోని విజేత మెటల్ వర్క్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నీచర్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి షెడ్డు కుప్పకూలింది. సనత్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.…