Saturday, 7 November 2026

తెలంగాణ

ప్రభుత్వాసుపత్రిలో విధులు బహిష్కరించిన పారిశుద్ధ్య కార్మికులు

కరీంనగర్‌ : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భవిష్యనిధి డబ్బులు జమ చేయడం లేదంటూ నిరసనకు దిగారు. కార్మికులతో ఆసుపత్రి వర్గాలు చర్చలు చేపట్టాయి.

నేడు కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి సదస్సు

హైదరాబాద్‌ : స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రస్థాయి సదస్సు నేడు జరగనుంది. హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో జరిగే సదస్సుకు కాంగ్రెస్‌ జిల్లా, నగర, పట్టణ…

ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు

మెదక్‌జిల్లా : జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రశీదులు లేని రూ. 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.

రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న నాగం ముఖ్య అనుచరుడు

హైదరాబాద్‌, టీఆర్‌ఎస్‌లోకి నేతల వలస కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నగర సమితి అధినేత నాగం జనార్ధన్‌ ముఖ్య అనుచరుడు ,మాజీ జెడ్పీటీసీ జి. జనార్ధన్‌గౌడ్‌ రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యలు ఇబ్రహీం…

తెలంగాణ సాధన మా జన్మహక్కు: ఎంపీ పొన్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘తెలంగాణ సాధన మా జన్మహక్కు’ అని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధించే వరకు తాము విశ్రమంచబోమని ఆయన స్పష్టం చేశరు.…

డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం

అదిలాబాద్‌ జిల్లా : నగరంలోని తిరుపల్లి వద్ద డైమండ్‌ ట్రాన్స్‌పోర్టు గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ఉన్న పత్తిబేళ్లు తగలబడటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది: కడియం

వరంగల్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌లో తాను చిత్తశుద్ధితో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పలువురు వివిధ రకాలుగా చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఇవాళ వరంగల్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పదవుల కోసం చేరలేదని తేల్చిచెప్పారు. తన వల్ల…

ఉగ్రవాద హింసను ఎదుర్కొంటామని సచివాలయ ఉద్యోగుల ప్రమాణం

హైదరాబాద్‌ : నేడు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా సచివాలయ ఉద్యోగులందరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రతిజ్ఞ చేయించారు. సంప్రదాయమైన అహింస, సహనం పట్ల నిబద్ధతతో ఉంటామని, ఉగ్రవాద హింసను సర్వశక్తులు ఒడ్డి, అన్ని విధాలుగా…

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న ఖాకీలు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: సీమాంధ్ర పార్టీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. విధిలో ఉన్న పోలీసులు అకారణంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై…

విద్యార్థులకు క్రీడా పోటీలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: నగరానికి చెందిన రాజీవ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వివిధ వేసవి శిక్షణ శిబిరాల్లో సైక్తింగ్‌, స్కేటింగ్‌లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పోటీలను నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని శాప్‌ సైక్లింగ్‌ వెలడ్రోమ్‌లో మంగళవారం ఉదయం పోటీలను మాజీ ఐఏఎస్‌ అధికారి…