Saturday, 7 November 2026

తెలంగాణ

తెలంగాణలో విజృభించిన భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 42 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మన్మకొండ, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండలో 41 డిగ్రీలు,…

ఐపిఎల్‌ ప్రారంభం నుంచే మ్యాచ్‌ ఫిక్సింగ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 క్రికెట్‌ మ్యాచ్‌ ప్రారంభం నుంచే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ తెలిపారు. ఇవాళ ఆయన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిన వీడియోక్లిప్పింగ్‌ మీడియాకు చూపించారు. ఐపీఎల్‌ ప్రారంభం నుంచే ప్లేయర్ల ఫోన్‌లను ట్యాప్‌…

హన్మకొండలో కేసీఆర్‌

వరంగల్‌: హన్మకొండలో తెరాస అధినేత కేసీఆర్‌ ద్విచక్రవాహన ర్యాలీని ప్రారంభించారు. అలాగే నగర పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు.

ప్రధాని దేశానికే భారంగా మారారు

హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పైభాజపా నేత వెంకయ్యనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్‌సింగ్‌ దేశానికే భారంగా మారారని దుయ్యబట్టారు. ముస్లిం యువకుల కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యలు ప్రజల్లో అపార్ధాలకు…

సచివాలయ ముట్టడికి టీఎస్‌ఎస్‌ఎఫ్‌ యత్నం

హైదరాబాద్‌: అవినీతి మంత్రులను మంత్రివర్గం తొలగించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌ తరలించారు.

దాల్మియా ఛార్జిషీటులో నిందితులకు సమన్లు జారీ

హైదరాబాద్‌: దాల్మియా ఛార్జిషీటులో నిందితుల సమన్లను సీబీఐ న్యాయస్థానం సీబీఐకి ఈరోజు అందజేసింది. ఈ కేసులో నిందితుడైన వైఎస్‌ జగన్‌ను వచ్చేనెల 7న కోర్టులో హాజరుపరచాలని సీబీఐకి పీటీ వారెంట్‌ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా…

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

హైదరాబాద్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌ జోన్‌ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండల పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 కిలోల వెండి, రూ. 8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మంత్రి సారయ్యను నిలదీసిన మహిళలు

వరంగల్‌: తన సొంత నియోజకవర్గమైన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తున్న మంత్రి బస్వరాజు సారయ్యకు వూహించిన విధంగా చుక్కెదురైంది. నియోజకవర్గంలో తాగునీరు, ఇతర సమస్యలపై మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రిని డిమాండ్‌…

బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం

హైదరాబాద్‌,జనంసాక్షి: కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశం కమిసన్‌ చూసుకుంటుందని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. బీసీ కార్పోరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు స్టయిఫండ్‌ పెంచుతామన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ కోసం నాయకులతో సమావేశం ఏర్పాటు…