విద్యార్థిని ఆత్మహత్య
నల్లగొండ, కనగల్ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
నల్లగొండ, కనగల్ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టు ముందు హాజరయ్యారు.
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం హాజరయ్యారు.
నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
కరీంనగర్, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణవాదులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మంచిర్యాలలో దళిత…
ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే తనపై సీఎం అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు. డిప్యూటీ సీఎం…
వరంగల్, జనంసాక్షి: మహబూబాబాద్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజా వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు 200 మంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
హైదరాబాద్, జనంసాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి విశాఖపట్నం నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రమానికి చేరేకున్న ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.