Thursday, 5 November 2026

తెలంగాణ

బయార్యంలోనే ఉక్కు కర్మాగారం చేపట్టాలి: దత్తాత్రేయ

ఖమ్మం సంక్షేమం: బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో భాజపా ఆందోళన చేపట్టింది. జిల్లా భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ మైదానం నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన ప్రదర్శనను మాజీ కేంద్రమంత్రి…

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.26,910, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,590గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 45,950గా…

గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆర్‌డబ్య్లూఎస్‌ ఎఈ మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెబ్బేరు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కాలిక్‌ మృతి చెందారు. ఏఈ ప్రయాణిస్తున్న వాహన్నాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

కేసీఆర్‌పై మండిపడ్డా ఎర్రబెల్లి

వరంగల్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. బయ్యారం, ఓబుళాపురం, పోలవరం విషయంలో తెరాస అధినేత కేసీఆర్‌కు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలు చేశారు. తెరాస వసూళ్లపై ఆధారాలు ఉన్నాయని.. కేసీఆర్‌…

పులి దాడి నుండి ఓవ్యక్తి తప్పించుకున్నాడు

శంషాబాద్‌: మండలంలోని తొండుపల్లి శివారులో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. స్థానిక సీఎన్‌ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మూడు పిల్లలతో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఓ వ్యక్తిపై పులి దాడికి యత్నించగా అతను తప్పించుకున్నాడు. స్థానిక…

మంత్రి రాంరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే ఫిర్యాదు

హైదరాబాద్‌: మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డిపై సభాపతికి ఎమ్మెల్యే చంద్రావతి ఫిర్యాదు చేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌కు వినతి అందించారు

వరంగల్‌: జిల్లాలో వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు ఈ ఉదయం వినతిపత్రం అందించారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దుండగులు చేత యాసిడ్‌కు గురైన ఓమహిళ

రంగారెడ్డి: పెద్దేముల్‌ మండలం జనగాంలో ఓ మహిళపై దుండగులు యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు

హైదరాబాద్‌: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.