Thursday, 5 November 2026

తెలంగాణ

మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

వరంగల్‌: ప్రజాప్రతిఘటన సానుభూతి పరుడుని వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.9లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరుడైన దామోదర్‌ పలువురిని బెదిరించి చందాలు వసూలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రాద్రి రాముని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో మంచినీటి సరఫరా, మినీ స్టేడియం సహాపలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.

శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ధూల్‌పేట్‌లోని మహాకాశేశ్వరి మందిరం నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాంకోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు అశేష భ్తజనంతో ఈ యాత్ర జరగనుంది. శ్రీరామ్‌ యువసేన, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ ఈ యాత్రను సంయ్తుంగా…

అల్పాహారం తిని 9మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనారు

కరీంనగర్‌: కాల్వశ్రీరాంపూర్‌లోని కస్తుర్బా గాంధీ వసతిగృహంలో అల్పాహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: కొందుర్గ్‌ మండలం పీర్జాపూర్‌లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,300, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,290గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…

వేడుకగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ భద్రాచల క్షేత్రంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య అభిజిత్‌ లగ్నాన సీతారాములవారికి వేదపండితులు మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి…

అభిజిత్‌ లగ్నాన మాంగల్యధారణ

భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం భద్రాద్రిలో అంగరంగవైభవంగా జరుగుతోంది. వేలాది భక్తుల మధ్య అభిజిత్‌ లగ్నాన వేద పండితులు సీతారాములకు మాంగల్యధారణ చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి

భద్రాచలం: జగదభిరాముని కల్యాణమహోత్సవం భద్రాద్రిలో ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీసీతారాములకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టువస్త్రాలు , తలంబ్రాలను సమర్పించారు. ఆయన వెంట మంత్రులు సి.రామచంద్రయ్య , పితాని సత్యనారాయణ, రాంరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులు ఈ…

పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.