Wednesday, 4 November 2026

తెలంగాణ

కొత్తరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి నోటీపై చేయాలని, సెక్షన్‌ 151 ఎ ప్రకారం ఎన్నికలు జరిపేందుకు…

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగివస్తారు.

తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం

నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పలు గ్రామాలకు…

స్పీకర్‌ నాదెండ్లకు జగన్‌ వర్గ ఎమ్మెల్యేలలేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్యాలు తక్షణమే రద్దు చేసి నోటిపై చేయాలని జగన్‌ వర్గ…

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.

రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్‌, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.

అసలు తగ్గించి కొసరు పెంచారు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి అంకెలగారడీతో పేదలను మోసగిస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో  ధ్వజమెత్తారు. పెంచిని విద్యుత్‌ ఛార్జీలను పేదలకు తగ్గించినట్లుగా చెబుతున్న సీపం అసలు తగ్గించి కొసరు పెంచారని మండి

జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు : కట్జూ

హైదరాబాద్‌ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిన్‌ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్‌ కౌన్సిల్‌ సభ్యుడు శ్రవణ్‌ గార్గ్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు.