Wednesday, 4 November 2026

October 2012

వార్తలు

రాగులపాడు వద్ద కూలిన గోడ: ఇద్దరు మృతి

కర్నూలు: జిల్లాలోని కృష్ణగిరి మండలం రాగులపాడు వద్ద క్వార్జ్‌ పరిశ్రమలో గోడకూలిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాగులపాడు చెందిన మాదన్న, లక్ష్మయ్యలుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Cover Story

మన్మోహన్‌ మంత్రి వర్గంలో కొత్త కొలువులు

22 మంది ప్రమాణ స్వీకారం మన రాష్ట్రనికి చెందిన 5గురు మంత్రులు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఆదివారం ఉదయం 11-30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 22 మంది ప్రమాణం చేశారు. రాష్ట్రపతి…

Featured News

కొణిదెల చిరంజీవి కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం

కామర్స్‌లో గ్రాడ్యుయేట్‌. ఆయనకు భార్య సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, కుమారుడు రామ్‌చరణ్‌ ఉన్నారు. తెలుగు సినీ రంగాన్ని 25 ఏళ్లకు పైగా ఏలిన మెగాస్టార్‌. 2008లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించారు. అంతేగాక…

ముఖ్యాంశాలు

ప్రమాణ స్వీకారం చేసీన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి

కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’ కోట్ల విజయభాస్కరరెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి. ఆయన కర్నూలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తొమ్మిదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1994లో తొలిసారి ఎంపీగా గెలిచారు.…

Featured News

ప్రమాణ స్వీకారం చేసీన సర్వే సత్యనారాయణ

సర్వే సత్యనారాయణ మల్కాజ్‌గిరి నియోజకవర్గం 1985లో ఎమ్మెల్యేగాను, 2004, 2009లో ఎంపీగాను ఎన్నికయ్యారు. సర్వే తొలుత ప్రభుత్వోద్యోగి. ఈయనకు కబడి, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఆటలంటే అమిత ఇష్టం. ఈయన 1954, ఏప్రిల్‌ 4న జన్మించారు. ఆయన ఉస్మానియాలో న్యాయశాస్త్ర…

జిల్లా వార్తలు

ప్రతిఘటన తప్పదు: కేటీఆర్‌

చేగుంట: తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లాలో అడుగు పెట్టాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఆదివారం కేటీఆర్‌, ఎంపీ విజయశాంతి విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశారు.…

జాతీయం

నూతన జట్టు లక్ష్యాలను అధిగమించగలదు: మన్మోహస్‌సింగ్‌

ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎదుర్కొనే సవాళ్లను నూతన జట్టు సమర్థంగా  అధిగమించగలదని ప్రధాని మన్మోహస్‌సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మంత్రి వర్గం యువత -అనుభజ్ఞుల సమ్మిళతమన్నారు..2014…

జిల్లా వార్తలు

చెరువులోపడి ముగ్గురి మృతి

మెదక్‌: ప్రమాదవశాత్తు చెరులోపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం చిద్రుప్పలో జరిగిన ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్యమ్మ (65), చంద్రకళ (35), మౌనిక (14) గా గుర్తించారు.

జాతీయం

మంత్రి వర్గ విస్తరణ అర్థవంతమైన మార్పు

ఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు చేసుకున్న మార్పులను ‘అర్థవంతమైన మార్పు’గా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ జనార్థన్‌ ద్వివేది అభివర్ణించారు. ప్రసుత్తం మంత్రి వర్గ విస్తరణ అర్థవంతంగా  ఉందని, క్యాబినెట్‌లో అనుభవజ్ఞులతో పాటు యువశక్తికి పెద్ద పీట…

వార్తలు

రెండు వాహనాలను దగ్ధం చేసిన మావోయిస్టులు

విశాఖపట్నం: విశాఖ జిల్లాలో మావోయిస్టులు ఆదివారం విరుచుకుపడ్డారు. చింతపల్లి మండలం దిగజెనబ వద్ద ఎస్సార్‌ కంపెనీకి చెందిన రెండు వాహనాలను మావోయిస్టులు దగ్థం చేశారు. దిగజెనబ వద్ద ఎస్సార్‌ కంపెనీకి చెందిన ఫైవ్‌ లైన్‌ను మావోలు ధ్వంసం చేశారు.