Thursday, 5 November 2026

April 2013

కరీంనగర్

వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం

మంథని గ్రామీణం, జనంసాక్షి: మంతని మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు ఐదు గ్రామాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని నాగపల్లి, స్వరపల్లి, వెంకటాపూర్‌, మల్లారం, అడవిసోమనపల్లి గ్రామాల్లో సుమారు గంటసేపు కురిసిన వడగండ్ల వానకు వరిపైరు…

తెలంగాణ

కామారెడ్డి ఇంటర్‌ విద్యార్థిని కిడ్నాప్‌

నిజామాబాద్‌, జనంసాక్షి: కామారెడ్డిలో ఇంటర్‌ విద్యార్థిని కీర్తనను గుర్త తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అత్యాచారాలు, తృణమూల్‌ అధినేత్రి మమతాబెనర్జీపై ఢిల్లీలో జరగిన దాడిపై సభను విపక్ష పార్టీలు స్తంభింపజేశాయి. అంతకు ముందు కూడా ప్రతిపక్షాల ఆందోళనల మధ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. ఈ…

తెలంగాణ

నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌, జనంసాక్షి: తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ నిమ్స్‌ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పంజాగుట్టలోని ఆస్పత్రి గేటు ముందు ఒప్పంద కార్మికులు తమ ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. ఆందోళన…

తెలంగాణ

కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ, రాయలసీమ వరకు కొనసాగుతోందని శాస్త్రవేత్తలు తెలపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో…

తెలంగాణ

మాజీ మంత్రి శంకర్రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈకేసులో ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో గతంలో శంకర్రావును పోలీసులు…

తెలంగాణ

వరంగల్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ

వరంగల్‌, జనంసాక్షి: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో సీమాంధ్రుకు చెందిన నేత 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. కేయూ జర్నిలిస్టుల శిక్షణాకార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.…

తెలంగాణ

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏదాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్‌లో పలు ప్రైవేట్‌ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

తెలంగాణ

ప్రేమజంట ఆత్మహత్య

మెదక్‌, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్‌ మండలం తీగుల్‌ నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేసినందుకు మనస్థాపానికి గురైన…

కరీంనగర్

విద్యుదాఘాతంలో అసిస్టెంట్‌ హెల్పర్‌కు తీవ్రగాయాలు

ఎల్లరెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని గొల్లపల్లిలో విద్యుత్తుశాఖలో అసిస్టెంట్‌ హెల్పర్‌గా పనిచేస్తున్న బాలయ్య విద్యుదాఘాతంతో సోమవారం తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.