Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

సీమాంధ్ర

తుపానుగా మారిన తీవ్రవాయుగుండం

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం 10.30 గంటలకు తుపానుగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పెను తుపానుగా మారే అవకాశం ఉంది. చెన్నైకి 1300 కిలోమీటర్ల నైరుతీ దిశలో…

తెలంగాణ

మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో అటెండర్‌ చంద్రయ్య నుంచి రూ. 1.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అటెండర్‌ను అదుపులోకి…

జాతీయం

ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌

ముంబయి : స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అరంభంలో 20 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ లాభపడింది. 5 పాయింట్లకుపైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుంది.

సీమాంధ్ర

శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి

కర్నూలు : జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ సాక్షిగణపతి అలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

తెలంగాణ

ఐపీఎల్‌-లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో శనివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడబోతోంది. లీగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉన్న పుణేకు ఈ మ్యాచ్‌ నామమాత్రం కాగా…. ముంబైకి మాత్రం…

తెలంగాణ

కడియంతో సమావేశం కానున్న తెరాస నేతలు

వరంగల్‌  : తెదేపాకు రాజీనామా చేసిన సీనియర్‌ నేత కడియం శ్రీహరితో ఈ మధ్యాహ్నం తెరాస నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కడియం ఈ ఉదయం తెదేపాకు రాజీనామా చేశారు.

జాతీయం

కరాచీలో ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు.. ఐదుగురి మృతి

ఇస్లామాబాద్‌ : ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌లో హింస చెలరేగింది. కరాచీలోని ఏఎస్‌పీ ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలి వద్ద అధికారులు, భద్రతాసిబ్బంది సహాయక…

సీమాంధ్ర

మంత్రి రామచంద్రయ్య నివాసం ముట్టడి

కడప : మంత్రి రామచంద్రయ్య ఇంటిని సీపీఐ నేతలు, కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జిల్లాలో బ్రహ్మణిని రద్దు చేసి ప్రభుత్వ ఉక్కు కర్మాగారం స్థాపించాలని డిమాండ్‌ చేశారు. మంత్రితో సీపీఐ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఇక్కడ ఉద్రిక్త…

సాహిత్యం

విడిపోవుడు కలిమికోసమే

వాళ్లతోటి ఏగుడు కష్టం కాలుకేస్తె మెడకేస్తరు మెడకేస్తె కాలుకేస్తారు ఏవో కథలు చెబుతారు జోకొడుతారు ..మనం ఊ కొట్టాలే .. ముక్కుసూటి మాట మనది నిలబడ్తం మాటమీద మందిని ముంచుడు రాదు మనిషి నమ్ముడే మన మన మతం…