Wednesday, 4 November 2026

May 2013

అంతర్జాతీయం

ఎదురు కాల్పుల్లో జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు , పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సుకుమా జిల్లా కుంట సరిహద్దు అటవీ ప్రాంతంలోని పీతలగూడ, పన్నిగూడ వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు.

తెలంగాణ

బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.

సీమాంధ్ర

బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

విజయవాడ, జనంసాక్షి:బందర్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదంజరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

తెలంగాణ

మాస్‌ కాపీయింగ్‌, 52 మండి డిబార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అంబేద్కర్‌ ఓపెస్‌ యూనివ్శటీ డిగ్రీపరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జోరుగా జరుగుతోంది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పరీక్షసెంటర్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 52విద్యార్థులను అధికారులు పట్టుకుని. వారిని డిబార్‌ చేశారు.

కరీంనగర్

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో నేతన్నలు సిరిసల్ల చేనేత విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

జిల్లా వార్తలు

‘5 ఏళ్లలో కాంతనపల్లి పూర్తి చేయండి’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంతనపల్లి ప్రాజెక్ట్‌ను ఐదేళ్లలో పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. 5 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌కు దివంగత ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని గుర్త…

జాతీయం

‘ఫ్రమ్‌ ఫ్రేమ్స్‌ టూ ఫేమ్‌’ పుస్తకావిష్కరణ

న్యూఢిల్లీ, ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ‘ఫ్రమ్‌ ఫ్రేమ్స్‌ టూ ఫేమ్‌’ పుస్తకాన్ని బిజెపి సీనియర్‌ నేత వెవకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత సురవరం సుధాకర రెడ్డి, దగ్గుబాటి దంపతులు, ఎన్టీఆర్‌ కుమారులు హాజరయ్యారు.…

జిల్లా వార్తలు

‘శైలజానాథ్‌ వ్యవహారంపై విచారణ జరపండి’

హైదరాబాద్‌, జనంసాక్షి: శైలజానాథ్‌ మనీల్యాండరింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అతని మిత్రుడు, బ్యాంకుల పాత్రిపై కూడా దర్యాప్తు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు కుంభకోణం వ్యవహారంలో ప్రధాన మంత్రి రాజీనామా చేయాలని విపక్షలు పట్టుబట్టాయి. అందులో భాగంగా సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 12…