Tuesday, 3 November 2026

May 2013

జాతీయం

ఏ విషయంలోనైనా ఒకరిద్దరు విభేదిస్తూనే ఉంటారు: కొండ్రు

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారని, ఏ విషయంలోనైనా ఒకరిద్దరు మంత్రులు విభేదిస్తూనే ఉంటారని కొండ్రు మురళి వ్యాఖ్యానించారు. బయ్యారం గనుల కేటాయింపు విషయంలో రాజకీయ రాద్ధాంతం అనవసరమని మంత్రి కొండ్రుమురళి…

తెలంగాణ

మహిళ మెడలోంచి గొలుసు తెంచుకుపోతున్న దొంగ అరెస్టు

హైదరాబాద్‌: ఒక మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంచుకుపోతున్న దొంగను అబిడ్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. దొంగ నుంచి 20 తులాల బంగారు అభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

జాతీయం

కర్ణాటకలో నేడు సోనియా ఎన్నికల ప్రచారం

ఢిల్లీ : పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న నేపధ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వూపందుకుంది. కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీ నేడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు, గుల్బర్గాలలో ఆమె ఈరోజు ప్రచారం చేయనున్నారు.

వార్తలు

ఆదిత్యుని దర్శించుకున్న మంత్రి కన్నా దంపతులు

అరసపల్లి : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్బకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్బకులు ఇప్పిలి శంకరశర్మ…

జాతీయం

సరబ్‌ది ఉద్దేశపూర్వహ హత్య: మనీష్‌తివారి

ఢిల్లీ, జనంసాక్షి: సరబ్‌జిత్‌ ఉద్దేశపూర్వకంగానే కుట్రపన్ని హత్య చేసినట్లు పరిగణిస్తామని కేంద్ర మంత్రి మనీష్‌తివారి అన్నారు. సరబ్‌ వ్యవహారంపై పాక్‌ ప్రధానితో 15 నెలల క్రితమే భారత ప్రధాన మన్మోహన్‌సింగ్‌ మాట్లాడారని, మానవీయ కోణంతో సరబ్‌ జిత్‌ను విడుదల…

జాతీయం

సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్యచేసింది: సోదరి దల్బీర్‌సింగ్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ను పాకిస్థాన్‌ ప్రభుత్వం హత్య చేసిందని ఆయన సోదరి దల్బీర్‌సింగ్‌ అరోపించారు. ఆయన మృతి తమ కుటుంబానికి తీరని లోటని ఆమె పేర్కొన్నారు. నిర్దోషికి ఎప్పుడూ శిక్ష పడదని, హత్య మాత్రమే జరుగుతుందని ఆమె ఆవేదనతో…

సీమాంధ్ర

రుయా ఆస్పత్రిలో నాల్గో తరగతి ఉద్యోగుల సమ్మె

తిరుపతి : తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో 18 రోజులుగా నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఈరోజు వారు అత్యవసర విధులకు కూడా గైర్హాజరవడమే కాక ప్రధాన భవనానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

శవాన్ని అప్పగించేందుకు పాక్‌ అంగీకారం

ఢిల్లీ, జనంసాక్షి:  సరబ్‌జిత్‌సింగ్‌ మృతదేహాన్ని భారత్‌కు అప్పగించేందుకు పాకిస్థాన్‌ అంగీకరించింది. పోస్ట్‌మార్టం అనంతరం భారత హైకమిషనర్‌ కార్యలయానికి సరబ్‌ జిత్‌ మృతదేహాన్ని అంగీకరించినట్లు సమాచారం.

జాతీయం

సరబ్‌జిత్‌ను ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు భావిస్తున్నాం: మనీష్‌

ఢిల్లీ : సరబ్‌జిత్‌ సింగ్‌ది కుట్రపూరిత హత్యగానే పరిగణిస్తున్నామని, ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు భావిస్తున్నామని కేంద్ర మంత్రి మనీష్‌ తివారీ అన్నారు. సరబ్‌పట్ల పాక్‌ వైఖరి అమానవీయమని ఆయన పేర్కొన్నారు. సరబ్‌ వ్యవహరించే తీరులో పాకిస్థాన్‌ వైఖరి సరిగా…